Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ మాట‌!..ప్ర‌జ‌ల కోసం బీజేపీతో దోస్తీకి రెడీ!

By:  Tupaki Desk   |   26 Sep 2017 11:17 AM GMT
క‌మ‌ల్ మాట‌!..ప్ర‌జ‌ల కోసం బీజేపీతో దోస్తీకి రెడీ!
X
రాజ‌కీయ ప్ర‌వేశంపై ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేసిన విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ను సైతం వెల్ల‌డించారు. రాజ‌కీయంగా అడుగు పెట్టాల‌ని ఓ గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటే ఇక న‌ట‌న‌కు గుడ్‌ బై చెబుతాన‌ని వెల్ల‌డించాడు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తే.. బీజేపీతోనూ చేతులు క‌లిపేందుకు సంశ‌యించ‌నని బాంబు పేల్చాడు. ఈ మేర‌కు ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌మ‌కాలీన అంశాల‌పై త‌న మ‌నోగ‌తాన్ని వెల్ల‌డించాడు క‌మ‌ల్‌. ఇంట‌ర్వ్యూ విశేషాలు..

ప్ర‌శ్న‌: మీరు సొంత‌గా పార్టీ పెట్టాల‌నుకున్నారు. దీనికి ప్రాతిప‌దిక ఏంటి?

క‌మ‌ల్‌: ఇది అతి పెద్ద నిర్ణ‌యం. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై కోపం అనేది కొంత మేర‌కే. నిజానికి న‌క్స‌లైట్‌ ల‌కు కూడా కోపం ఉంటుంది. అలాగ‌ని వారు సిద్ధాంతాల‌నే న‌మ్ముతారు. నేను కూడా అంతే

ప్ర‌శ్నః మీ సిద్ధాంతం ఏమిటి?

క‌మ‌ల్‌: నాకు ఒక‌ట‌ని కాదు. అనేకం ఉన్నాయి. వాటి నుంచి ఎంచుకోవాలి. క‌మ్యూనిస్టు - సోష‌లిస్టు సిద్ధాంతాల‌కు నేను అభిమానిని. కొన్ని స‌ఫ‌ల‌మ‌య్యాయి. కొన్ని విఫ‌ల‌మ‌య్యాయి.

ప్ర‌శ్నః మీరు వామ‌ప‌క్షాల వైపే ఉంటారా?

క‌మ‌ల్ః లేదు. కొన్ని స‌ర్దుబాట్లు మాత్ర‌మే ఉండొచ్చు. ప్ర‌జ‌లే ప్ర‌ధానం. నేను సేవ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నా.

ప్ర‌శ్నః రాజ‌కీయాలు చాలా భిన్నం. మ‌రి సినిమాలు వ‌దిలేస్తారా?

క‌మ‌ల్ః అవును! చ‌ట్ట‌ప‌రంగా(గ‌ట్టిగా) నిర్ణ‌యం తీసుకుంటే. సినిమాలు వ‌దిలేస్తాను. ఇలా వ‌దిలేయ‌డం బాధే. ప్ర‌స్తుతం సినిమాల్లో కొన‌సాగుతున్నాను.

ప్ర‌శ్న‌: మీ విష‌యాల‌కు సంబంధించి బీజేపీ ప‌రిస్థితి ఏంటి?

క‌మ‌ల్ః ప్ర‌స్తుతం బీజేపీ బాగానే ప‌నిచేస్తోంద‌ని నా అభిప్రాయం. ఒక్క బీఫ్‌(గొడ్డు మాంసం) విష‌యంలోనే నేను విభేదించాను. నేనుబీఫ్ తినేవాడిని. కానీ, ఇప్పుడు మానేశా. అలాగ‌ని ఇత‌రులు మానేయాల‌ని చెప్ప‌ను.

ప్ర‌శ్నః బీజేపీతో సంబంధాల‌ను ఖండిస్తారా?

క‌మ‌ల్ః రాజ‌కీయాల్లో అంట‌రానితనం అంటూ ఉండ‌దు. ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తే.. బీజేపీతో క‌లిసేందుకు నాకు అభ్యంతరం ఎందుకు? రాష్ట్ర భ‌విష్య‌త్తు - ప్ర‌జ‌ల సంక్షేమం కోసమే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.

ప్ర‌శ్నః మీలోని హేతువాది బీజేపీతో క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదా?

క‌మ‌ల్ః నిజ‌మే నేను హేతువాదినే. అలాగ‌ని గుళ్లు గోపురాలు ధ్వంసం చేయ‌డంలేదు క‌దా? నేను అవినీతికి మాత్ర‌మే వ్య‌తిరేకిని. అవినీతి చేసే వారంటేనే నాకు అస‌హ్యం. ఈ విష‌యంలో రాజీ ప‌డే ధోర‌ణి నాలో లేదు.

ప్ర‌శ్నః మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు?

క‌మ‌ల్ః పేద‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం. చిట్ట‌చివ‌రి పేద‌వాడిని చేర‌క‌పోతే.. ఈ రాజ్యాంగ‌మే వృధా అని నా ఉద్దేశం

ప్ర‌శ్నః అవినీతి గురించి?

క‌మ‌ల్ః అవినీతి ఒక వ్య‌క్తిది కాదు. ఓటుకు రూ.5000 తీసుకుంటున్న ద‌గ్గ‌రే అవితీని ప్రారంభం అవుతోంది. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తున్నాం. అవినీతికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం.

ప్ర‌శ్నః అవినీతిని అరిక‌డ‌తాన‌ని మీరు న‌మ్మ‌కంగా ఉన్నారా?

క‌మ‌ల్ః లేదు. పూర్తిగా అర‌క‌డ‌తాన‌ని చెప్ప‌లేను. చ‌రిత్ర‌ను ఒక‌సారి చూస్తే.. రాత్రికి రాత్రి అవినీతి అంతం కాద‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. సినీమా ప‌రిశ్ర‌మ‌నే తీసుకున్నా.. ఇక్క‌డా అవినీతి ఉంది. ఎంత‌మంది ప‌న్నులు స‌క్ర‌మంగా నిజాయితీగా చెల్లిస్తున్నారు? నా మ‌టుకు నేను ప‌న్నులు క‌డుతున్నాను. బ్లాక్ మ‌నీ జోలికి పోవ‌డం లేదు.

ప్ర‌శ్నః రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక అనేక విమ‌ర్శ‌లు ఎద‌ర్కోవాలి. మీరు ప్రాణ స్నేహితుడు అనే ర‌జ‌నీనిసైతం విమ‌ర్శించాల్సి రావొచ్చు?

క‌మ‌ల్‌: విమ‌ర్శ విమ‌ర్శ‌లాగానే ఉండాలి. అది అవ‌మాన‌క‌ర ధోర‌ణిలో పోరాదు. నిర్మాణాత్మ‌కంగా ఉండే విమ‌ర్శ ఎప్పుడూ స‌హేతుక‌మే. మేం ఇద్ద‌రం ఒకే ఇండ‌స్ట్రీలో ఉన్నా.. మార్గాలు వేరు. ఇద్ద‌రి అభిరుచి వేరు.

ప్ర‌శ్నః రాజ‌కీయాల‌పై సినిమా ఏమ‌న్నా చేస్తున్నారా?

క‌మ‌ల్ః అవును ప్లాన్ చేస్తున్నాం.