Begin typing your search above and press return to search.

వైసీపీకి ఓటేస్తావా.. కొట్టుకున్న తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   12 Oct 2019 9:42 AM GMT
వైసీపీకి ఓటేస్తావా.. కొట్టుకున్న తమ్ముళ్లు
X
అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాత పగలు చెలరేగాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంత చౌదరి - టీడీపీ ప్రస్తుత కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ చార్జి - మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఉమామహేశ్వరనాయుడు ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకోవడం టీడీపీలో దుమారం రేపింది.

ఇరు వర్గాల నాయకులు - కార్యకర్తల మధ్య మొదట వాగ్వాదం.. ఆ తర్వాత దాడులు జరగడం ఉద్రికత్తకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే ఉన్నం టీడీపీ కార్యాలయానికి వచ్చి వెళుతుండగా టీడీపీ ఇన్ చార్జి ఉమమాహేశ్వరనాయుడు అప్పుడే వాహనంలో కార్యాలయానికి వచ్చారు. ఉమామహేశ్వర నాయుడు లోపలికి వెళుతూ వైసీపీకి ఓట్లేసిన వారు కూడా టీడీపీ కార్యాలయానికి వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తూ కదిలారు.

ఈ వ్యాఖ్యలు తమ గురించే అని సీరియస్ అయిన ఉన్నం.. ఆయన అనుచరులు నువ్వు ఎవడు తమను టీడీపీ కార్యాలాయానికి రావద్దనడానికి అంటూ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం.. గొడవ. దాడుల వరకు పరిస్థితి వెళ్లింది.

అక్కడున్న నాయకులు సర్ధి చెప్పి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో టీడీపీ నేతల స్ట్రీట్ ఫైట్ కు తెరపడింది. కానీ విభేదాలు మాత్రం పొడచూపాయి.