Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు సినిమాల్లో న‌టించాల‌ని ఆశ‌: ర‌మ్య

By:  Tupaki Desk   |   2 March 2018 4:36 PM GMT
కేసీఆర్ కు సినిమాల్లో న‌టించాల‌ని ఆశ‌: ర‌మ్య
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర శేఖ‌ర్ రావుపై ఆయ‌న సోద‌రుడి కుమార్తె, కాంగ్రెస్ నాయ‌కురాలు క‌ల్వ‌కుంట్ల ర‌మ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న గొంగ‌ళి పురుగును కూడా తాను ముద్దుపెట్టుకుంటాన‌ని కేసీఆర్ ప్ర‌గ‌ల్భాలు ప‌లికార‌ని - తాను -త‌న భ‌ర్త కూడా తెలంగాణ ఉద్య‌మంలో చురుకైన పాత్ర పోషించినా త‌న‌ భ‌ర్త‌కు కేసీఆర్ త‌గినంత ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆమె ఆరోపించారు. త‌న భ‌ర్త చావుబ‌తుకుల్లో ఉన్న‌ప్ప‌టికీ కేసీఆర్ క‌నీసం ప‌ల‌క‌రించ‌లేద‌ని - సీఎం రిలీఫ్ ఫండ్ కు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌గారు లెట‌ర్ పెట్టినా ప‌ట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అటువంటి వ్య‌క్తి....తెలంగాణ ప్ర‌జ‌లకు ఏవిధంగా మేలు చేస్తార‌ని ర‌మ్య ప్ర‌శ్నించారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె కేసీఆర్ ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్ గారికి సినిమా రంగంపై మ‌క్కువ ఎక్కువ‌ని, తాను చ‌దువుకునే రోజుల్లో ఆయ‌న సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించారని ర‌మ్య తెలిపారు. ఆయ‌న‌కు తెలుగు భాష‌ - క‌ళ‌ల‌పై మ‌క్కువ ఎక్కువ‌ని, కాబ‌ట్టి సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి ఆయ‌న‌కు ఉండేద‌ని తెలిపారు. అయితే, ఆయ‌న నాట‌కాల్లో న‌టించారో లేదో త‌న‌కు తెలియ‌ద‌ని ర‌మ్య అన్నారు. ఆ కాలంలో చ‌దువుకోవ‌డానికి - ఉద్యోగ రీత్యా దుబాయ్ - గ‌ల్ఫ్ కంట్రీస్ కు వెళ్లేందుకు కేసీఆర్.....మ‌స్క‌ట్ పైరవీ(క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్) లు చేసేవార‌ని - ఆయ‌న హైద‌రాబాద్ - ఢిల్లీ ల నుంచి కార్య‌క‌లాపాలు న‌డిపేవారని చెప్పారు. ఉద్యోగార్థుల‌ను గ‌ల్ఫ్ దేశాల‌కు పంపించేవార‌ని తెలిపారు.