Begin typing your search above and press return to search.

కేటీఆర్ - క‌విత‌లు భూదందా చేస్తున్నారు...ర‌మ్య

By:  Tupaki Desk   |   2 March 2018 2:08 PM GMT
కేటీఆర్ - క‌విత‌లు భూదందా చేస్తున్నారు...ర‌మ్య
X
మంత్రి కేటీఆర్, ఎంపీ క‌విత‌ల‌పై ఆయ‌న సోద‌రుడి కుమార్తె, కాంగ్రెస్ నాయ‌కురాలు క‌ల్వ‌కుంట్ల ర‌మ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కేటీఆర్ - కవిత‌లు కూడా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నార‌ని..... ప్ర‌జ‌లు - టీఆర్ ఎస్ నాయ‌కులు - కాంగ్రెస్ నాయ‌కులు...అంద‌రికీ ఈ విష‌యం తెలుస‌ని ఆమె అన్నారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె కేసీఆర్ ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఎటువంటి మ‌ద్ద‌తు లేకుండానే ఆమె సోద‌రుడు క‌న్నారావు....హైద‌రాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్ లు చేస్తున్నారా అని ర‌మ్యను విలేక‌రి ప్ర‌శ్నించారు. త‌న త‌మ్ముడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడ‌ని, కాబ‌ట్టి ఇటువంటి పుకార్లు రావ‌డం స‌హ‌జ‌మ‌ని ర‌మ్య బ‌దులిచ్చారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌క‌ముందునుంచే క‌న్నారావు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం, చిన్న చిన్న ల్యాండ్ సెటిల్మెంట్ లు చేస్తున్నార‌ని, అత‌డికి కేసీఆర్ స‌హ‌కారం లేద‌ని తెలిపారు. కేసీఆర్ .....సీఎం కాక ముందే క‌న్నారావు ల్యాండ్ సెటిల్మెంట్ లు చేశాడ‌ని....ఇపుడు సీఎం అయ్యాక మ‌రింత అగ్రెసివ్ గా సెటిల్మెంట్ లు జ‌రుగుతున్న‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌లను ర‌మ్య ఖండించారు. మంత్రిగా - ఎంపీగా ఉన్నంత మాత్రాన కేటీఆర్ - క‌విత‌లు భూదందా చేయ‌కూడ‌ద‌ని ఎక్క‌డా లేద‌ని, డ‌బ్బంటే అంద‌రికీ ఇష్ట‌మేన‌ని అన్నారు. త‌న బంధువు ఉమేష్ రావు .....కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నార‌ని ఆరోపించారు. తాను అలా చేయ‌న‌ని చెప్పారు. ఒక పార్టీ కండువా క‌ప్పుకొని, మ‌రో పార్టీకి చెందిన‌ ముఖ్యమంత్రి ద‌గ్గ‌ర స‌హాయం పొంద‌న‌ని చెప్పారు.