Begin typing your search above and press return to search.

పోటీ దీక్ష‌లు.. క‌విత వ‌ర్సెస్ బీజేపీ..!

By:  Tupaki Desk   |   10 March 2023 3:00 PM GMT
పోటీ దీక్ష‌లు.. క‌విత వ‌ర్సెస్ బీజేపీ..!
X
తెలంగాణ నాయ‌కురాలు, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత ఢిల్లీలోదీక్ష‌కు రెడీ అయ్యారు. కూర్చున్నారు కూడా. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆమె మ‌హిళా రిజ‌ర్వేష‌న్ కోసం.. దీక్ష చేప‌ట్టారు. అయితే.. బీజేపీ నేత‌లు దీనికి కౌంట‌ర్‌గా మ‌రో దీక్ష‌చేస్తున్నారు.

అది కూడా జంత‌ర్‌మంత‌ర్‌కు కొద్ది దూరంలోనే వారు కూడా దీక్ష చేస్తున్నారు. వీరి డిమాండ్ ఏంటంటే.. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఉన్న వారిని స‌త్వ‌ర‌మే విచారించి.. వారికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని కోరుతున్నారు.

ఇదే డిమాండ్‌తో బీజేపీ మ‌హిళా మోర్చా నాయ‌కురాళ్లు దీక్ష‌కు దిగారు. అటు క‌విత‌.. ఇటు బీజేపీ మ‌హిళల దీక్ష‌ల‌తో ఢిల్లీలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ట్రాఫిక్‌ను మ‌ళ్లించారు. ఆంక్ష‌లు కూడా విధించారు. అయితే.. ఈ దీక్ష‌ల‌పై రాజ‌కీయ దుమారం జోరుగా సాగుతోంది. త్వ‌ర‌లోనే తెలంగాణ ఎన్నిక‌లు ఉన్నందు న‌.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. నాయ‌కులు ఇలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నార‌ని.. మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వివిధ పార్టీలు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కొన్ని పార్టీలు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో దూసుకెళ్తున్నాయి. ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఇదిలా ఉంటే అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. బీజేపీ కవిత దీక్షకు పోటీగా హైదరాబాద్లో కూడా దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది.

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేపడుతుండగా.. ఆమెకు ధీటుగా భాగ్యనగరంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతితో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చివ‌ర‌కు ఏం తేలుస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.