Begin typing your search above and press return to search.

మోడీ..రాహుల్ కు క‌విత ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ విన్నారా?

By:  Tupaki Desk   |   20 March 2019 5:04 AM GMT
మోడీ..రాహుల్ కు క‌విత ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ విన్నారా?
X
ఎక్క‌డైనా యేషాలు వేసుకోండి.. నా ద‌గ్గ‌ర కాదు. నా జోలికి వ‌స్తేనా సంగ‌తి మామూలుగా ఉండ‌ద‌న్న‌ట్లుగా నిజామాబాద్‌ ఎంపీ క‌విత తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. ఎర్ర‌జొన్న‌.. ప‌సుపు రైతులు త‌మ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాలంటూ గ‌డిచిన కొద్దికాలంగా ఆందోళ‌న‌లు చేయ‌టం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ వీరి స‌మ‌స్య‌ల‌కు ఎలాంటి ప‌రిష్కారం ల‌భించ‌లేదు.

ఇలాంటి వేళ త‌మ క‌ష్టాన్ని దేశానికి తెలియ‌జేయాల‌న్న ఉద్దేశంతో ఎవ‌రూ ఊహించ‌ని ప్లాన్ చేశారు. దాన్ని అమ‌లు చేస్తారా? లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వారి ఆలోచ‌న‌కు మీడియాలో పెద్ద ఎత్తున చోటు ల‌భించింది. ఇంత‌కూ వారి ప్లాన్ ఏమిటంటే.. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కాని నేప‌థ్యంలో త‌మ ఎంపీ క‌వితపై వెయ్యి మంది నిల‌బ‌డాల‌ని రైతులు ఆలోచించారు. అదే విష‌యాన్ని మీడియాకు చెప్ప‌టంతో ఈ వెరైటీ నిర‌స‌నకు ప్రాధాన్య‌త ల‌భించింది.

అయితే.. ఈ అంశంపై నిజామాబాద్ ఎంపీ క‌విత అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు. ప‌సుపు పంట‌కు జాతీయ స్థాయి బోర్డు ఏర్పాటుకు తాను శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశాన‌ని చెప్పిన ఆమె.. ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం తాను ఎక్క‌ని కొండ లేదు.. మొక్క‌ని బండ లేద‌న్నారు. నాలుగు రాష్ట్రాల సీఎం వ‌ద్ద‌కు పోయాన‌ని.. ఆ సీఎం లంద‌రిని ఒప్పించి మ‌ద్ద‌తు లేఖ‌లు తీసుకొని ప్ర‌ధానికి ఇచ్చినా ఫ‌లితం లేకుండా పోయిన‌ట్లు ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ‌లోని బీజేపీ నేత‌లు ప‌సుపు బోర్డు ఏమైందంటూ త‌న‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌సుపు బోర్డు ఇచ్చేది తానా? కేంద్ర‌మా? అని క్వ‌శ్చ‌న్ చేసిన క‌విత‌.. త‌న‌పై వెయ్యిమంది రైతులు బ‌రిలో నిలుస్తార‌న్న అంశంపై త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. రైతుల‌కు మేలు చేసేలా ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. అలాంటిది త‌న‌పైన వెయ్యి మంది రైతులు నామినేష‌న్లు వేయాల‌ని చెబుతున్నార‌ని.. అలా చేస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అయితే.. అంతుకు మించి కావాల్సిందేమిట‌న్నారు.

వెయ్యి నామినేష‌న్ల‌తో స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే.. ప్ర‌ధాని మోడీ.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వెయ్యేసి చొప్పున నామినేష‌న్లు వేద్దామ‌న్నారు. అప్పుడు ప‌సుపుబోర్డు స‌మ‌స్య ఎందుకు ప‌రిష్కారం కాదో చూద్దామ‌న్నారు. ప‌సుపు బోర్డు ఏర్పాటులో మోడీ పాత్ర ఉంద‌ని చెబుతున్న‌క‌విత‌.. ప్ర‌ధాని మీద కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద వెయ్యి మందిని ఎందుకు దింపుతున్న‌ట్లు? అన్నది ఒక క్వ‌శ్చ‌న్.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ప‌సుపు బోర్డు కేంద్రం వేయాల‌ని వాదిస్తున్న క‌విత‌క్క‌.. ఎర్ర‌జొన్న రైతుల స‌మ‌స్య‌ల మీద మాత్రం మాట మాట్లాడ‌క‌పోవ‌టం ఏమిటో? అయినా.. దేశంలో మ‌రెక్క‌డా అమ‌లు కాని రీతిలో రైతుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే గొప్ప రాష్ట్రం తెలంగాణ అయిన‌ప్ప‌డు.. రాష్ట్రంలోని ప‌సుపు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం మీద ఆధార‌ప‌డ‌టం ఎందుకు?

సంప‌న్న రాష్ట్రంగా.. మిగిలిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ప‌సుపు రైతుల్ని సొంతంగా ఆదుకునే ప్లాన్ ఎందుకు వేయ‌న‌ట్లు? రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన త‌న తండ్రికి చెప్పి.. మ‌న ప‌సుపు రైతుల్ని మ‌నం ఆదుకోవాలి. కేంద్రం సాయం చేయ‌ని వైనానికి మ‌నం అండ‌గా నిలిచి.. దేశానికి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని చెబితే కేసీఆర్ కాదంటారా?

ఎక్క‌ని కొండ లేదు.. మొక్క‌ని బండా లేద‌ని పంచ్ మాట‌లు చెప్పే క‌న్నా.. క‌ళ్ల ఎదుట ఉన్న క‌న్న‌తండ్రిని ప్రాధేయ‌ప‌డినా.. నాన్నారు.. ఈ ప‌ని మీరు చేయాల్సిందేన‌ని కుమార్తె హోదాలో గ‌ట్టిగా కోరినా.. కేసీఆర్ లాంటి సీఎం చేయ‌కుండా ఉంటారా? అందునా.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి డ‌బ్బులు లెక్క పెట్టుకోవ‌టం.. చిల్ల‌ర‌గా రియాక్ట్ కావ‌టం లాంటివి కేసీఆర్ లో ఏ కోశాన క‌నిపించ‌వు. అలాంట‌ప్పుడు కేంద్రం మీద అదే ప‌నిగా ప‌డే బ‌దులు.. అధికార పార్టీగా తాను చేయలేక‌పోయాన‌న్న వాస్త‌వాన్ని ఒప్పుకుంటే బాగుంటుందేమో మేడ‌మ్‌ జీ.

ప‌సుపు బోర్డు ఏర్పాటు కేంద్రం చేయాల‌ని చెబుతున్న క‌విత‌.. కొన్ని విష‌యాల్ని మ‌ర్చిపోతున్నారు. ఏదైనా స‌మ‌స్య‌ను కేంద్రం కానీ.. మ‌రెవ‌రి దృష్టికైనా తీసుకెళ్లిన‌ప్పుడు సానుకూలంగా స్పందిస్తే.. అప్పుడు వ‌చ్చిన క్రెడిట్ ను వారికి ఇచ్చే బ‌దులు.. క‌స్సుమంటూ.. మెడ‌లు వంచి మ‌రీ ప‌ని చేయించిన‌ట్లుగా చెప్పే గొప్ప మాట‌లు అవ‌త‌ల వారికి కాలిపోయేలా చేస్తాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మాట‌ల‌తో మంట పుట్టించే గుణం కూడా ఎదుటివాళ్లు స్పందించ‌కుండా ఉండేలా చేస్తుంద‌న్న విష‌యాన్ని ఎంపీ క‌విత ఎప్ప్ఉడు గుర్తిస్తారు.

క్రెడిట్ వ‌స్తే త‌మ గొప్ప‌త‌నంగా.. తేడా వ‌స్తే అదంతా కేంద్రం చేత‌కానిత‌నంగా విరుచుకుప‌డే పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి వ్యూహాన్ని ప‌క్క‌న పెట్టేస్తే మంచిదేమో! ఒకే త‌ర‌హా మాట‌లు అన్ని వేళ‌లా ఎఫెక్టివ్ గా ఉండ‌వ‌న్న విష‌యాన్ని క‌ల్వ‌కుంట్ల క‌విత మేడ‌మ్ జీ గుర్తిస్తే మంచిదేమో?