Begin typing your search above and press return to search.
కవిత టార్గెట్ మారింది
By: Tupaki Desk | 22 Dec 2018 11:26 AM ISTగులాబీ దళపతి - తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన టార్గెట్ మారిందని ఆమె నర్మగర్భంగా వెల్లడించారు. 2014లో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణతో విజయం సాధించారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే - కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓడించి నియోజకవర్గంపై టీఆర్ ఎస్ జెండా ఎగురవేశారు. తద్వారా ఎంపీ కవిత తను టార్గెట్ చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో తెలియజెప్పారు.
తాజాగా ఆమె తన ఫోకస్ మారినట్లు ట్విట్టర్ లో వెల్లడించారు.జగిత్యాలలో గెలుపును ప్రస్తావిస్తూ మీ తదుపరి లక్ష్యం ఏ నియోజకవర్గం అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో ప్రశ్నించగా.. మంథని అని కవిత సమాధానమిచ్చారు. తాజా ఎన్నికల్లో మంథని నుంచి కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు గెలిచారు. ఈ నేపథ్యంలో ఇకపై మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలపడం అక్కడి రాజకీయాలను హీటెక్కించేదేనని అంటున్నారు.