Begin typing your search above and press return to search.
పంతం నెగ్గించుకున్న మోడీ
By: Tupaki Desk | 22 Feb 2016 7:48 AM GMTయూనివర్సిటీల్లో నిరసన జ్వాలలు దేశప్రజల చూపును ఏ మేరకు తమవైపు తిప్పుకున్నాయో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పీఠం సైతం అదే స్థాయి ఆసక్తిని కలిగించింది. రాష్ట్రపతి పాలన కొనసాగించాలా? ముఖ్యమంత్రి ఏలుబడిలో పరిపాలన ఉండాలా? సీఎం సీటులో ప్రస్తుత నాయకుడే ఉంటారా...కొత్త వ్యక్తికి పగ్గాలిస్తారా అనే సందేహాలకు తాజాగా ఫుల్ స్టాప్ పడింది. నాటకీయ పరిణామాల మధ్య అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మాజీ నాయకుడు కలిఖోపుల్ బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అరుణాచల్ లో యథాతథస్థితి కొనసాగించాలన్న గత ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో మరుసటి రోజే రాష్ట్రపతి పాలనను కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన కొద్దిసేపటికే కొత్త ముఖ్యమంత్రిగా కలిఖోపుల్ తో గవర్నరు జేపీ రాజ్ ఖోవా పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.
రాష్ట్రపతి పాలన, ప్రభుత్వం కొనసాగింపుపై కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన వినిపిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతాయన్న తమ ఆందోళన నిజమవుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి తగినంత మెజారిటీ ఉందని పేర్కొంటూ సభలో బలనిరూపణకు అవకాశం ఇచ్చేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ధర్మాసనం సభ్యుల మధ్య భిన్న దృక్కోణాలు ఉన్నాయని అన్ని వాదనలు ముగిశాకే తుది ఉత్తర్వులు ఉంటాయని జస్టిస్ కేహార్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం అధికారం చెలాయించేందుకే రాష్ట్రపతి పాలన విధించారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం సీఎం కుర్చిలో ఉన్న నాయకుడిని దించేసి బీజేపీ మద్దతుతో నూతన సీఎం ఎంపికయ్యేలా మోడీ చక్రం తిప్పారు.