Begin typing your search above and press return to search.

నయీం కేసులో మరో దుమారం..కళంకిత పోలీసులకు క్లీన్ చిట్

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:00 PM GMT
నయీం కేసులో మరో దుమారం..కళంకిత పోలీసులకు క్లీన్ చిట్
X
నయీం.. ఈ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ను 2016 ఆగస్టులో ఎన్ కౌంటర్ లో తెలంగాణ పోలీసులు చంపేశారు. ఆ తర్వాత నయీం ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి అందరూ షాక్ అయ్యారు. నయీం ఎందరినో చంపాడని.. వేల ఎకరాల భూములను కబ్జా చేశాడని.. చాలా మందిని బెదిరించాడని.. ఈ కేసులు పోలీసులు, ప్రజాప్రతినిధులకు హస్తం ఉందని కథనాలు వెలువడ్డాయి.

నయీం బాధుతులు అందరూ బయటకు వచ్చి అతడు చేసిన ఘోరాలను చెప్పుకొచ్చారు. దీంతో నయీం కేసును సీబీఐతో కానీ విజిలెన్స్ తో కానీ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వచ్చింది.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కళంకిత పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ లభించడం విశేషం. నయీంతో 25మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రాగా.. ఆ అధికారులను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

కాగా నయీం కేసులో విచారణ జరిపిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆ 25మంది పోలీసు అధికారులకు ఊరట లభించింది. దీనితో వారిక పోస్టింగ్ లను ప్రభుత్వం ఇచ్చే అవకాశముంది.

నయీం కేసును లోక్ పాల్ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అందుకే లోక్ పాల్ కిందకు తీసుకురావాలని కోరింది. నయీం కేసులో ఇప్పటికీ తేలని అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. నయీం డైరీ, భూములతోపాటు డబ్బులకు సంబంధించిన డంప్ ఎక్కడ ఉందో తేల్చాలని కోరింది. అయితే ఇంత సీరియస్ కేసులో పాత్ర ఉన్న పోలీసులక్ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.