Begin typing your search above and press return to search.
గెస్ట్ లకు గిఫ్టుల కోసం రూ.1.66 కోట్లా సారూ?
By: Tupaki Desk | 22 Aug 2019 7:58 AM GMTపన్నుపోటుతో ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాకు చేర్చుకునే ప్రభుత్వం.. ఆ డబ్బుల్ని ఖర్చు చేసేటప్పుడు ఎంత బాధ్యతతో.. మరెంత నిబద్ధతతో ఖర్చు చేయాలి? కానీ.. అందుకు భిన్నంగా చేతికి ఎముక లేనట్లు.. ఖర్చు చేసిన తీరు చూస్తే నోటి వెంట మాట రానంత షాక్ తగలటం ఖాయం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు.. నాటికి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ను పిలవటం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన వీఐపీ గెస్ట్ లకు గిఫ్టులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన లెక్క వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అతిధులకు వివిధ రూపాల్లో ఉన్న వెండి తొడుగులతో చేసే బహుమతుల కోసం ఏకంగా రూ.1.66 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయటం వింటే షాక్ తినాల్సిందే. ఈ భారీ ఖర్చు విషయం తాజాగా వెల్లడైంది. మొత్తం 12 బహుమతుల్ని తయారు చేయించగా.. ఇందుకోసం రూ.1.66 కోట్ల ఖర్చు అంచనా వేయగా.. అందులో యాభై శాతం మొత్తానికి శాంక్షన్ ఆర్డర్ కు పేమెంట్ కూడా ఇచ్చేశారు.
సీఎం ఆఫీసు ఓఎస్డీ ఇచ్చిన ఆదేశాల మేరకే.. ఈ భారీ ఖర్చుకు ఓకే చెప్పేసినట్లు చెబుతారు. వాస్తవానికి రూ.80వేల కోట్ల ఖర్చుతో నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై పలువురు ప్రముఖులు తప్పు పడుతున్నారు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వారైతే.. ప్రాజెక్టుకోసం పెట్టే ఖర్చు.. దాని వల్ల కలిగే ప్రయోజనం ఎక్కడా సరిపోవటం లేదంటూ విమర్శలు చేయగా.. దానిపై స్పందించిన సీఎం కేసీఆర్ జేపీ మీద తీవ్ర విమర్శల్ని సంధించారు. ఇదిలా ఉంటే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరైన వీఐపీ అతిధులకు ఇచ్చే బహుమతుల కోసం కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మరి.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో? చూడాలి.