Begin typing your search above and press return to search.
కళాను ప్రభుత్వమే హీరోను చేస్తోందా ?
By: Tupaki Desk | 21 Jan 2021 5:15 AM GMTతెలుగుదేశంపార్టీలోని సీనియర్ నేతల్లో కళా వెంకట్రావు కూడా ఒకరు. రాష్ట్ర అధ్యక్షునిగా, మాజీమంత్రిగా పనిచేసిన కమిడి కళా వెంకట్రావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నుండి ఓడిపోయారు. తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మొన్నటి వరకు పనిచేశారు. నిజానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన చూపిన ప్రభావం ఏమీలేదనే చెప్పాలి. కళాను రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరూ పెద్దగా లెక్క కూడా చేసేవారు కాదు. అలాంటిది ఆయన స్ధానంలో మరో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత కళా గురించి పార్టీ జనాలే మరచిపోయారు.
అలాంటిది హఠాత్తుగా కళాను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవటంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. చంద్రబాబునాయుడు అయితే కళాను ఏకంగా బీసీ నేతను అరెస్టు చేస్తారా అంటూ ఊగిపోవటం మరీ విచిత్రంగా ఉంది. బీసీ నాయకత్వం లేకుండా చేయటం కోసమే కళాను రాత్రిపూట అరెస్టు చేసినట్లు ఆరోపణలు గుప్పించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు కళా ఏమీ బీసీ నాయకునిగా ఎప్పుడూ పెద్దగా హైలైట్ కాలేదు.
బీసీల్లో కళాకు నిజంగానే అంతపట్టుంటే రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన్ను చంద్రబాబు తప్పించేవారే కాదు. పార్టీకి కళా పెద్దగా ఉపయోగం లేదని అనుకున్న తర్వాతే ఆయన్ను తప్పించి ఆయన స్ధానంలో అచ్చెన్నాయుడుకి పగ్గాలు అప్పగించారు. చెప్పుకోవాలంటే అచ్చెన్న కూడా బీసీనే. కానీ ఈయన కూడా బీసీ సామాజివకర్గంలో చెప్పుకోదగ్గ నేతేమీ కాదు. తమ అవసరాలకు మాత్రం బీసీ కార్డును ఉపయోగించుకుంటారంతే. కాపులను బీసీల్లో చేర్చటాన్ని బీసీ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో అచ్చెన్న కానీ కళా కానీ బీసీలకు మద్దతుగా కనీసం నోరిప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
అలాంటి కళాను పోలీసులు విచారణకు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. రామతీర్ధం దేవాలయంకు ఈనెల 2వ తేదీన విజయసాయిరెడ్డి వెళినపుడు ఆయన కారుపై టీడీపీ శ్రేణులు చెప్పులు, రాళ్ళు వేశారట. అదే సమయంలో అక్కడే ఉన్న చంద్రబాబు, అచ్చెన్న, కళా ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు కారుపై దాడులు చేశారనేది పోలీసుల అభియోగం. పై ముగ్గిరిపై పోలీసులు కేసులు నమోదు చేసినా తాజాగా కళాను మాత్రమే విచారణకు తీసుకున్నారు. అంటే తొందరలోనే అచ్చెన్నను కూడా విచారణ పేరుతో అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. చంద్రబాబును ఏమి చేస్తారో చూడాలి.
మొత్తానికి రాత్రిపూట కళా ఇంటిని పోలీసులు చుట్టుముట్టడ, ఆయన్ను అదుపులోకి తీసుకోవటం, దాదాపు రెండున్నర గంటలపాటు విచారణ పేరుతో పోలీసుస్టేషన్లో అట్టిపెట్టుకుని తర్వాత విడిచిపెట్టడమంటే ప్రభుత్వమే కళా వెంకట్రావును హీరోను చేసినట్లయ్యింది. రామతీర్ధం లాంటి ఘటనల్లో వాహనాలపై చెప్పులు పడటం, రాళ్ళు పడటం చాలా సహజంగానే జరుగుతుంటాయి. దాన్ని పట్టుకుని దాడులకు ప్రేరేపించారని, హత్యాయత్నానికి ప్రయత్నించారని కేసులు పెట్టి అరెస్టులు చేస్తే ప్రతిపక్షాలకే ఉపయోగం కానీ ప్రభుత్వానికి ఒరిగేదీమీ ఉండదు.