Begin typing your search above and press return to search.

మిత్రుడైన వేళ మెచ్యురిటీ చూసుకోలేదా క‌ళా?

By:  Tupaki Desk   |   9 July 2018 8:37 AM GMT
మిత్రుడైన వేళ మెచ్యురిటీ చూసుకోలేదా క‌ళా?
X
రాజ‌కీయ నేత‌ల నోట వ‌చ్చే మాట‌లు చాలా చిత్రంగా ఉంటాయి. తామేం మాట్లాడుతున్నామ‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేకుండా మాట్లాడే నేత‌లు కొంద‌రు క‌నిపిస్తారు. ఈ త‌ర‌హా వ్య‌వ‌హార‌శైలి టీడీపీ నేత‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. త‌మ మాట‌ల‌కు లాజిక్కుల్ని ఏ మాత్రం చూసుకోకుండా మాట్లాడేయ‌టంలో తెలుగు త‌మ్ముళ్లు ముందుంటారు.

ఇప్పుడు త‌మ‌ను బండ‌కేసి బాదేసిన‌ట్లుగా మాట్లాడుతున్న ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న త‌మ్ముళ్లు.. ఆయ‌న‌లో ప‌రిప‌క్వ‌త లేద‌ని.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటున్నారు. ప‌వ‌న్ లో రాజ‌కీయ ప‌రిప‌క్వత లేద‌న్న‌ది నిజ‌మే అయిన ప‌క్షంలో.. ఆయ‌న్ను మిత్రుడిగా ఒప్పుకొని.. ఆయ‌న‌తో భుజం భుజం రాసుకుపూసుకుంటూ తిరిగిన రోజుల మాటేమిటి?

చెడ్డ‌వ్య‌క్తిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కూడ‌దు. మ‌రి.. ప‌వ‌న్ లో రాజ‌కీయ అవ‌గాహ‌న లేనిది నిజ‌మే అయితే.. ఆ విష‌యం మిత్రుడిగా స్వీక‌రించే స‌మ‌యంలో అర్థం కాలేదా? ఏదో హ‌డావుడిగా అలా జ‌రిగిపోయింద‌నుకుందాం. మ‌రి.. నాలుగేళ్ల‌లో ప‌వ‌న్ మీద ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ని త‌మ్ముళ్లు చాలామంది ఇప్పుడు మాత్రం భుజాలు ఎందుకు త‌డుముకున్న‌ట్లు?

ఇప్పుడంటే టీడీపీ నేత‌ల‌పైనా.. అధినాయ‌కుడు.. ఆయ‌న పుత్ర‌ర‌త్నం మీద విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో ప‌వ‌న్ రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త తెలుగు త‌మ్ముళ్ల‌కు గుర్తుకు వ‌చ్చిందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావ్‌. రాజ‌కీయం తెలియ‌ని వాళ్లు ప్రాంతాలు.. మ‌తాలు రెచ్చ‌గొట్ట‌టం చేస్తున్నార‌న్నారు. విష బీజాలు నాటేలా మాట్లాడుతున్న వారు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. వీరి కార‌ణంగా రాబోయే త‌రాలు ఎంత ఇబ్బంది ప‌డ‌తాయ‌న్న‌ది ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

రాజ‌కీయాలంటే రెచ్చ‌గొట్ట‌టం కాద‌ని.. ఉత్త‌రాంధ్ర‌లో వెనుక‌బాటు మీద మీ పార్టీ ఏం నిర్ణ‌యాలు తీసుకుంద‌న్న క‌ళా.. జ‌న‌సేన అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ అంటూనే.. అది కూడా కాద‌ని కేవ‌లం వ‌న్ మ్యాన్ షో అనొచ్చంటూ త‌ప్పు ప‌ట్టారు. అయితే.. ప‌వ‌న్ మీద ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన క‌ళా.. గ‌డిచిన నాలుగేళ్లుగా ఆ ప‌ని ఎందుకు చేయ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే బాగుంటుంది.

త‌మ‌ను ఏమ‌నుకుండా.. త‌మ పాల‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌నంత వ‌ర‌కూ నెత్తిన పెట్టుకోవ‌టం.. ఒక్క‌సారి తిట్ల దండ‌కం అందుకున్నంత‌నే ప‌రిప‌క్వ‌త లేద‌న్న మాట‌ల్ని అనేందుకు వెన‌కాడ‌ని క‌ళా లాంటోళ్లు.. గ‌తం గురించి మ‌ర్చిపోవ‌టం స‌రికాదంటున్నారు. క‌ళా లాంటి వారు అనే మాట‌ల‌తో ప‌వ‌న్ లాంటోళ్లు మ‌రింత చెల‌రేగిపోవ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో టీడీపీ.. జ‌న‌సేన‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత ముదిరిపోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.