Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాకు పెద్ద మాస్టారు...!
By: Tupaki Desk | 3 Feb 2023 10:14 AM GMTకళా తపస్వి, మహా యశ్వసి అని ఆయన గురించి చెబుతారు. ఆ రెండు విశేషణాలూ ఆయనకు సరిపోతాయి. ఎవరి గురించి అయినా మాట్లాడితే ఎంతో కొంత అతిశయోక్తి ఉంటుంది. కానీ అదేమిటో కానీ కాశీనాధుని విశ్వనాధ్ గురించి మాట్లాడాలన్న చెప్పాలన్నా పదాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన గొప్పతనం వర్ణించడానికి పదాలు కూడా సరిపోని మేరు నగ ధీరుడు ఆయన.
ఆయన సినిమాలు ఎన్నో చెబుతాయి. మంచి చెడులను వివరిస్తాయి. సినిమా అన్న బలమైన మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న వారుగా ఆయన్ని చూడాలి. విశ్వనాధ్ ఒక పాఠశాల. ఆయన స్కూల్ లో అడుగు పెట్టిన వారు ఎంతటి నటుడైనా అక్కడ విద్యార్ధి కావాల్సిందే. ఎందుకంటే అంతదాకా నేర్చుకున్నది ఒక ఎత్తు. విశ్వనాధ్ నేర్పేది ఒక ఎత్తు.
ఆయన డైలాగ్ డిక్షన్ నుంచి హావ భావాల నుంచి బాడీ లాంగ్వేజ్ నుంచి అన్నీ ఎంతో ఓపికగా శ్రద్ధంగా నేర్పిస్తారు. తాను అనుకున్న ఎఫెక్ట్ వచ్చెంతవరకూ ఆయన అలా టేకులు తీస్తూనే ఉంటారు. విశ్వనాధ్ సినిమాలలో చాలా మంది నటించారు. ఇంకా చాలా మంది నటించలేదు. దానికి కారణం ఏంటి అంటే విశ్వనాధ్ సినిమాలో ఒదిగిపోవాలి. ఆయన చెప్పినట్లుగా చేయాలి.
అదొక అందమైన పరిశ్రమ. కళాత్మకమైన శ్రమ. అది ఒక తపస్సు. అక్కడ అందరూ విద్యార్ధులే. ఒక్కరే మాస్టార్ ఉంటారు. అయనే కె విశ్వనాధ్. ఆయన పెద్ద మాస్టారు మాదిరిగా తెలుగు సినిమాకు సరికొత్త పాఠాలు చెప్పారు. కళలోనూ సందేశం ఉంటుందని, ఆ సినిమాలు కూడా వాణిజ్యపరంగా ఆడుతాయని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చాటి చెప్పిన వారు విశ్వనాధ్.
ఇక విశ్వనాధ్ తన అర్ధ శతాబ్దం పైగా సినీ జీవితంలో అచ్చంగా యాభై సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశారు. ఆయనకు ఉన్న పేరు ప్రతిష్టలకు వంద సినిమాలు అయినా తీయవచ్చు. అయితే రాశి కంటే వాసిని నమ్ముకున్న వారు విశ్వనాధ్. అంతే కాదు ఎవరైనా నిర్మాత తన వద్దకు వస్తే మీకు నాతో సినిమా అంటే డబ్బులు రావు అని ముందే రిజల్ట్ చెప్పేసేవారు. అయితే మాకు డబ్బు కాదు పేరు వస్తే చాలు, మీరు మాత్రమే మా సినిమా తీయాలి అని చాలా మంది అభిరుచి కలిగిన నిర్మాతలు ఆయన వద్దకు వచ్చి సినిమాలు తీయించుకున్నారు.
అలా అనేక మంది నిర్మాతలను ఆయన నిలబెట్టారు. యువచిత్ర బ్యానర్ మీద కె మురారి తీసిన తొలి సినిమాకు కె విశ్వనాధ్ డైరెక్టర్. ఆ సినిమా సీతామాలక్ష్మి.ఆ తరువాత ఆ బ్యానర్ ఎంతో గొప్పగా ఎదిగింది. అలాగే మరో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఎన్నో సినిమాలు విశ్వనాధ్ తోనే తీసారు. అందులో శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం అన్న క్లాసిక్స్ ని ఎవరూ మరచిపోలేరు.
విశ్వనాధ్ తో ఒక సినిమా చేస్తే చాలు ఆ నిర్మాత పరిపూర్ణుడు అవుతారు. నటించిన నటులు కూడా తమ జన్మ సార్ధకం అయింది అనుకుంటారు. విశ్వనాధ్ ఎందరినో వెండితెరకు పరిచయం చేశారు. ఒక వేటూరి సుందరరామమూర్తిని, ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆయన తన సినిమాల ద్వారా తెలుగు పరిశ్రమకు అందించారు. వారు ఎంతటి పేరు ప్రఖ్యాతులు గడించారో అందరికీ తెలిసిందే.
ఇక విశ్వనాధ్ బీఎస్సీ చదివి సౌండ్ ఇంజనీర్ గా వాహినీ స్టూడియోస్ లో చేరడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. అలా 1951 నుంచి మొదలైన ఆయన ప్రస్థానం 1965లో ఆత్మ గౌరవం సినిమాకు డైరెక్షన్ చేయడం ద్వారా దర్శకుడిగా మారింది. ఇక ఆదుర్తి సుబ్బారావు దగ్గర ఆయన దర్శకత్వ శాఖలో పనిచేశారు. అందరూ కొత్త వారితో ఆదుర్తి తేనె మనసులు తీస్తే ఆ సినిమాలో కొత్తగా వచ్చిన క్రిష్ణ రామ్మోహన్ వంటి వారికి నటనలో మెలకువలు నేర్పిన తొలి గురువు విశ్వనాధ్.
ఇక మూగమనసులు సినిమాలో జమున పాత్రకు గోదారి యాసతో పాటు డైలాగ్ డిక్షన్ అంతా నేర్పిన వారు విశ్వనాధ్. విశ్వనాధ్ మొదటి సినిమా ఆత్మగౌరవం తోనే నంది అవార్డు అందుకుని భవిష్యత్తును నాడే ఆవిష్కరించుకున్నారు అని చెప్పాలి. ఆయనలో మంచి కథకుడు ఉన్నారు. స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నారు దిగ్దర్శకుడు ఉన్నారు. అద్భుతమైన నటుడు ఉన్నారు. అన్నిటికీ మించి పెద్ద గురువు ఉన్నారు. అందుకే ఆయన తెలుగు సినిమాకు పెద్ద మాస్టారు. ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన పాఠాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.