Begin typing your search above and press return to search.

ఎంపీ తోట‌ అరెస్ట్ కు ఆదేశాలిచ్చారు!

By:  Tupaki Desk   |   18 May 2016 6:09 AM GMT
ఎంపీ తోట‌ అరెస్ట్ కు ఆదేశాలిచ్చారు!
X
చంద్ర‌బాబు స‌ర్కారుకు కాస్త ఇబ్బందిక‌ర ప‌రిణామంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహుల మీద వ‌చ్చిన ఒక ఆరోప‌ణ‌కు సంబంధించి.. ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌న్న ఆదేశాల్ని ఉమ్మ‌డి రాష్ట్ర బాల‌ల హ‌క్కుల సంఘం జారీ చేయ‌టం గ‌మ‌నార్హం. పిల్ల‌ల న‌గ్న చిత్రాల్ని తీసి.. వాటిని సోష‌ల్ మీడియాలో ఉంచుతాన‌న్న బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీ తోట‌ను అదుపులోకి తీసుకోవాలంటూ బాల‌ల హ‌క్కుల సంఘం ఆదేశాలుజారీ చేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

ఒక స్థ‌ల వివాదం విష‌యంలో ఆ స్థ‌ల య‌జ‌మాని కుమార్తె న‌గ్న చిత్రాల్ని తీయించి.. బెదిరిస్తున్నార‌న్న‌ది ఎంపీ తోట మీద ఉన్న ఆరోప‌ణ‌. తూర్పు గోదావ‌రి జిల్లా మాధ‌వ‌ప‌ట్నానికి చెందిన లాయ‌ర్ ర‌వికుమార్‌ కు కాకినాడ‌లో విలువైన భూమి ఉంది. దాన్ని ఎంపీ.. ఆయ‌న అనుచ‌రులు సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌ల‌తో ప‌లు విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న‌ది లాయ‌ర్ ర‌వికుమార్ ఆరోప‌ణ‌.

ఇందులో భాగంగా ఈ మ‌ధ్య‌న స్థ‌ల య‌జ‌మాని ర‌వికుమార్ పెద్ద కుమార్తె అనారోగ్యంతో ఆసుప‌త్రికి వెళితే.. ఎక్స్ రే తీయించాల‌న్న నెపంతో బ‌ట్ట‌లు మార్చుకోవాల‌ని చెప్పి.. ఫోటోలు తీశారని.. త‌ర్వాత అత‌ని చిన్న కుమార్తెను సెల‌వురోజు స్పెష‌ల్ క్లాస్ ఉంద‌ని స్కూల్ కు పిలిపించి అభ్యంత‌ర‌క‌ర ఫోటోలు తీసిన‌ట్లుగా ఎంపీ మీద ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఉదంతం మీద ర‌వికుమార్ బాల‌ల హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

త‌న స్థ‌లాన్ని ఇవ్వ‌కుంటే.. త‌న పిల్ల‌ల ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో ఉంచుతాన‌ని ఎంపీ తోట బెదిరిస్తున్నార‌ని ర‌వికుమార్ ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసుల‌కు ఈ ఉదంతం మీద ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై ఉమ్మ‌డి రాష్ట్రాల బాల‌ల హ‌క్కుల సంఘం స్పందించి ఎంపీని అదుపులోకి తీసుకోవాల‌న్న ఆదేశాల్నిజారీ చేసిన‌ట్లుగా సంఘం స‌భ్యుడు అచ్యుత రావు వెల్ల‌డించారు. దీనిపై ఎంపీ తోట వాద‌న ఏమిటో చూడాలి..?