Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే భర్త ఎంత మాటన్నాడు...!!
By: Tupaki Desk | 7 Aug 2015 11:55 AM GMTప్రజాప్రతినిధులే కాదు, వారి కుటుంభసభ్యులూ చాలా ఎక్కువ చేస్తున్నారు ఒక్కోసారి. తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి భర్త పిల్లి సత్తిబాబు ఆశా కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా అవమానకరంగా మాట్లాడారు. దీంతో వారంతా తీవ్ర ఆవేదనతో ఆందోళనకు దిగారు.
కాకినాడ రూరల్ పండూరు పీహెచ్ సీలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆశావర్కర్లు పీహెచ్ సీలో ఉన్న సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యేను కోరారు. ఆ వెంటనే ఎమ్మెల్యే భర్త పిల్లి సత్తిబాబు ''మీ సమస్యలు తెలియాలంటే మీతో కాపురం చేయాలా?'' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే భర్త సత్తిబాబు వ్యాఖ్యలపై ఆశా వర్కర్లు మండిపడ్డారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ కలెక్టరేట్ ఆఫీసు ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.