Begin typing your search above and press return to search.
కాకినాడ ఎన్నికలు అలా ముగిశాయి
By: Tupaki Desk | 29 Aug 2017 10:44 PM ISTకాకినాడ కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మరో అంకం ముగిసింది. కీలకమైన పోలింగ్ ఘట్టం ఈ రోజు (మంగళవారం) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ సాగింది.
పోలింగ్ సమయం ముగిసిన తర్వాత క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు తర్వాత కూడా ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. మొత్తం 50 వార్డులకు 48 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. కోర్టులో కేసు కారణంగా రెండు వార్డుల్లో ఎన్నికల్ని నిర్వహించలేదు.
మొత్తంగా 65 శాతం మేర పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడలేదు. చిన్న చిన్న ఘటనలు మినహా కాకినాడ పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగిసినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సంబంధించి రెండు ఫిర్యాదు అందాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. చాలాచోట్ల ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతు కావటంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. అదే సమయంలో పోలింగ్ వేళ.. సెలవు ప్రకటించకపోవటం పోలింగ్ తక్కువగా నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1 నుంచి జరగనుంది.