Begin typing your search above and press return to search.
పవన్:కాస్త స్టడీ చేసి మాట్లాడితే.. స్టడీగా ఉండొచ్చు
By: Tupaki Desk | 5 Feb 2018 6:55 AM GMTఇప్పట్లో రాజకీయాల్లోకి ఎంటరవుతున్న వారు - నవతరం రాజకీయవేత్తలు రాజకీయ పార్టీలను కూడా ఓ కార్పొరేట్ ఎఫైర్ లాగా చాలా సిస్టమేటిక్ ఎప్రోచ్ తో నడిపిస్తున్నారు. ఏదో నలుగురు చెమ్చాగాళ్లు తమ వెంట ఉన్నారు కదాని.. పార్టీ పెట్టేసి.. చందాలకు జోలెపట్టి.. అలా ఎన్నికల్లోకి వెళ్లిపోయే వారు ఇప్పుడు కానరావడం లేదు. పార్టీ పెట్టాలనుకుంటే.. ముందస్తుగా దానికి తగినంత రీసెర్చి - సర్వేలు - పార్టీ తరఫున ఒక విధానం - పాలసీ నిర్ణయం తీసుకోవాలంటే.. దానికి బోలెడంత రీసెర్చి.. ఒక ప్రకటన చేయాలంటే.. రీసెర్చి ఇలా.. ఒక పద్ధతి ప్రకారం పార్టీలు నడుస్తున్నాయి. ఈ విషయంలో హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కూడా గట్టి నెట్ వర్కే ఉంది. కేవలం శాస్త్రీయ సర్వేలు మాత్రమే కాదు.. అత్యాధునిక పోకడల్లో వ్యవహారాలు నడిపించగల హైటెక్ ఉద్ధండులు కూడా పవన్ కు చిటికె వేస్తే సేవలందించే దూరంలోనే ఉన్నారు. అయినా కొన్ని పొరబాట్లు జరుగుతూనే ఉన్నాయనడానికి నిదర్శనమే కడియం నర్సరీ లకు సంబంధించిన వారినందరినీ రైతులుగా గుర్తించి.. వారందరికీ ఉచిత విద్యుత్తు ఇచ్చేయాలంటూ వారి తరఫున ప్రభుత్వాన్ని కోరేయడం అని ప్రజలు భావిస్తున్నారు.
కడియం అంటే ప్రపంచ స్థాయిలో ఖ్యాతి ఉంది. మన దేశ ప్రతిష్టనే పెంచే రేంజిలో ఇక్కడినుంచి రకరకాల ఉద్యానవన మొక్కలను విక్రయిస్తూ ఉంటారు. దేశాంతరాలకు వెళ్లే వ్యాపారంగా దీనికి ప్రసిద్ధి ఉంది. ఆ రేంజిలోనే వారి వ్యాపారలావాదేవీలు - లాభాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కడియం రైతులు పవన్ వద్దకు వెళ్లారు. తమను రైతులుగా గుర్తించాలని - ఉచిత విద్యత్తు కావాలని కోరారు. పవన్ వెంటనే వారికి వరం ప్రసాదించేశారు. ప్రభుత్వాన్ని ఆ మేరకు కోరేశారు. మీ సమస్యలు తీరే వరకు మీ వెంటే ఉంటా.. అని అందరికీ చెప్పినట్లే వారికీ చెప్పేశారు. సరిగ్గా ఇక్కడే ముందస్తు రీసెర్చి ఫెయిలయిందనే భావన ప్రజల్లో ఉంది.
ఎవ్వరు తమ వద్దకు వచ్చినా సరే.. వారికి అనుకూల మాటలు చెప్పడం రాజకీయ నాయకులకు తప్పదు. కానీ అందులోనే వారి లౌక్యం - అనుభవం - అవగాహన - పరిణతి బయటపడతాయి. తమ వద్దకు వచ్చిన వారు ఎలాంటి గొంతెమ్మ కోరికలైనా కోరవచ్చు గాక... వాటిలోని ఔచిత్యాన్ని బట్టి నాయకులు స్పందించాలే తప్ప.. ఎవరు ఏం అడిగినా.. ఓకే అనేస్తూ పోతే.. వారి మాటలకు కూడా విలువ ఉండదు. నిజానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనేకం.. (అంటే పాడిపరిశ్రమ - కోళ్ల పరిశ్రమ) లాంటి వన్నీ వ్యవసాయం అనే గొడుగు కిందకి వచ్చేసి అదనపు లబ్ది పొందడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. కడియం నర్సరీ వ్యాపారుల ప్రయత్నం కూడా అలాంటిదే అని గ్రహించలేకపోవడం పవన్ పార్టీకి సంబంధించి.. ముందస్తు రీసెర్చి విభాగాల లోపంగా పరిగణించాలి. ఇలా చేస్తూ పోతే.. ఎరువులు తయారు చేసేవాళ్లు కూడా తమను రైతులుగా - తమ పనిని వ్యాపారంగా కాకుండా వ్యవసాయంగా గుర్తించాలని అడుగుతారు.. అప్పుడిక అసలు రైతులకు దక్కే మేలు కూడా దక్కకుండా పోతుంది. కాబట్టి...ఉచితానుచితాలు ఎరగకుండా.. ఎడా పెడా హామీలివ్వడం.. పవన్ వంటి.. ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడికి తగదని ప్రజలు అనుకుంటున్నారు.