Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ ఎమ్మెల్యే కారును టిప్ప‌ర్ ఢీ కొంది

By:  Tupaki Desk   |   23 Jun 2017 12:31 PM GMT
ఆ టీడీపీ ఎమ్మెల్యే కారును టిప్ప‌ర్ ఢీ కొంది
X
ఏపీ అధికార‌ప‌క్షానికి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు పెద్ద ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌టంతో పార్టీ నేత‌లు..కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే క‌దిరి బాబురావు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు.

శుక్ర‌వారం ఆయ‌న ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం శీలంవారి ప‌ల్లె గ్రామం ద‌గ్గ‌ర ఎమ్మెల్యే బాబురావు ప్ర‌యాణిస్తున్న కారును టిప్ప‌ర్ ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న బాబురావుకు గాయాల‌య్యాయి. ఆయ‌న‌తో పాటు ఉన్న వారికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వెంట‌నే స్పందించిన అక్క‌డి వారు ఎమ్మెల్యేను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ఏ మాత్రం తేడా కొట్టినా పెనుప్ర‌మాదానికి కార‌ణ‌మ‌య్యేద‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/