Begin typing your search above and press return to search.

పోలింగ్ కు ముందే ఆ జ‌డ్పీ పీఠాన్ని సొంతం చేసుకున్న వైసీపీ!

By:  Tupaki Desk   |   14 March 2020 4:51 PM GMT
పోలింగ్ కు ముందే ఆ జ‌డ్పీ పీఠాన్ని సొంతం చేసుకున్న వైసీపీ!
X
జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక జిల్లా ఫ‌లితం పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. పోలింగ్ కు ముందే జడ్పీ పీఠం ఎవ‌రిదో క్లారిటీ వ‌చ్చింది. ఇది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ క‌డ‌ప విష‌యంలో. ఆ జ‌డ్పీ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఏక‌గ్రీవ విజ‌యాల‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప జ‌డ్పీ సీటును సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. మొత్తం 35 జ‌డ్పీటీసీ స్థానాల‌ను క‌డ‌ప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏక‌గ్రీవంగా సొంతం చేసుకుంది. ఆ జిల్లాలో ఉన్న మొత్తం జ‌డ్పీ స్థానాల సంఖ్య 50. జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని సొంతం చేసుకోవాలంటే ఏ పార్టీ అయినా క‌నీసం 26 స్థానాల‌ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు ముందే 35 స్థానాల‌ను ఏక‌గ్రీవంగా సొంతం చేసుకుంది. దీంతో జ‌డ్పీ చైర్మ‌న్ ఆ పార్టీకి ద‌క్కుతున్న‌ట్టే.

35 జ‌డ్పీటీసీ సీట్ల‌కు ఒకే నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో.. పోలింగ్ కు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌విని సొంతం చేసుకోవ‌డానికి మార్గం సుగ‌మం అయ్యింది. ఇక మిగిలిన జ‌డ్పీ స్థానాల‌కు మాత్రం పోలింగ్ జ‌ర‌గ‌వ‌చ్చు. వాటిల్లోనూ విజ‌యం ప‌ట్ల అధికార పార్టీ విశ్వాసంతో క‌నిపిస్తూ ఉంది! మొత్తానికి పోలింగ్ కు ముందే ఒక జిల్లా జ‌డ్పీ పీఠం విష‌యంలో క్లారిటీ రావ‌డం గ‌మ‌నార్హం.