Begin typing your search above and press return to search.

కడప మాజీ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి !

By:  Tupaki Desk   |   4 Nov 2020 8:10 AM GMT
కడప మాజీ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి !
X
కడప మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత కందుల శివానందరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. కందుల శివానందరెడ్డి కడప ఎమ్మెల్యేగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరుపున 2004, 2009లో పోటీ చేసిన కందుల శివానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

క‌డ‌ప‌లో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన కేఎస్ ఆర్ ఎం ఇంజ‌నీరింగ్ కాలేజీ అధినేత‌గా ఆయ‌న సుప‌రిచితులు. అంతేకాదు, ముస్లిం మైనార్టీల ఆధిప‌త్యం ఉన్న క‌డ‌ప అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొంద‌డంతో ఆయనకి విశేషమైన గుర్తింపుఉంది. శివానందరెడ్డి తండ్రి కందుల ఓబుల‌రెడ్డి క‌డ‌ప పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప్రజలకి సేవ చేశారు. తండ్రి వార‌స‌త్వంగా శివానంద‌రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్యేగా క‌డ‌ప న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అమూల్య‌మైన సేవ‌లు అందించార‌నే గుర్తింపు శివానంద‌రెడ్డికి ఉంది. జిల్లాలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ్య‌తిరేకంగా వ‌ర్గంగా శివానంద‌రెడ్డి కొన‌సాగేవారు. అయితే రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం కొంత కాలం వైసీపీలో శివానంద‌రెడ్డి కొన‌సాగారు.

క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానం నుంచి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై శివానంద‌రెడ్డి త‌మ్ముడు రాజ‌మోహ‌న్ ‌రెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఆ తర్వాత రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఇక ఈ మద్యే గుండె సంబంధిత శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంటి వ‌ద్దే విశ్రాంతి తీసుకుంటున్న శివానంద‌రెడ్డి ఈ తెల్లవారు జామున ఆక‌స్మికంగా మృతి చెందారు. శివానందరెడ్డి మృతి జిల్లా ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటే .