Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ విక‌ర్ష్ : వైసీపీలో తిరిగి చేరిన‌ నేత‌లు

By:  Tupaki Desk   |   2 Feb 2017 4:58 PM GMT
ఆప‌రేష‌న్ విక‌ర్ష్ : వైసీపీలో తిరిగి చేరిన‌ నేత‌లు
X
తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విక‌టించిన‌ట్లు క‌నిపిస్తోంది. క‌డ మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు కడప కార్పొరేటర్లు మళ్లీ సొంతగూటికి చేరారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వారు తిరిగి వైసీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా - మేయర్ సురేష్‌ బాబు నేతృత్వంలో ఈ కార్పొరేట‌ర్లు మళ్లీ సొంత గూటికి వ‌చ్చారు. వైఎస్ జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇడుపులపాయలో జగన్ స‌మ‌క్షంలో వీరంతా వైసీపీలోకి పునఃప్ర‌వేశం చేశారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో గెలిచిన కార్పొరేటర్ల‌లో వైసీపీ నుంచి 12 కార్పొరేటర్లు విడతల వారీగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు - ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ల సమక్షంలో పసుపు కండువా క‌ప్పుకొన్నారు. అయితే వారిలో ఇద్దరు ముగ్గురు కొన్ని రోజులకే సొంత గూటికి వెళ్లారు. కాగా తాజాగా మ‌రో ఆరుగురు తిరిగి వైసీపీలో చేర‌డం గ‌మ‌నార్హం. పార్టీలో తిరిగి చేరిన సంద‌ర్భంగా వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేట్లరు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/