Begin typing your search above and press return to search.
విను వీదిలో పాక్ చేసిన ఈ పని దుస్సాహసమే!
By: Tupaki Desk | 17 Oct 2019 5:08 PM GMTపాకిస్థాన్ - దుస్సాహసం... ఈ రెండు పదాలను విడదీయడం అస్సలు కుదరదు. నిజమే... దుస్సాహసానికి పాకిస్థాన్ పర్యాయపదంగా మారిపోయిందని ఆ దేశ వ్యవహార సరళిని చూసే ఏ వ్యక్తి అయినా ఇట్టే చెప్పేస్తారు. ఈ మాట మన దేశ వాసుల నుంచే కాకుండా ప్రపంచంలోని మెజారిటీ దేశాలకు చెందిన వారి నుంచి కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని సార్లు ఎదురుదెబ్బలు తగిలినా కూడా బుద్ధి తెచ్చుకోని పాక్... తనదైన శైలి దుస్సాహసాలకు పాల్పడుతూనే ఉంది. అందుకే పాక్ అంటే దుస్సాహసం... దుస్సాహసం అంటే పాక్ అనే వినబడుతోంది. ఈ మాట ముమ్మాటికీ నిజమేనని స్వయంగా పాకిస్థానే తన తాజా చర్యతో నిరూపించుకుంది.
సరే... తనదైన మార్కు దుస్సాహసాన్ని నిరూపించుకున్న పాక్ ఈ తాజా చర్యలో ఏం చేసిందన్న విషయానికి వస్తే... నిండా ప్రయాణికులతో ఆకాశంలోకి ఎగిరిన స్పైస్ జెట్ విమానాన్ని పాక్... తన గగనతలం మీదుగా రౌండప్ చేసేసింది. అది కూడా ఏదో అలా నిఘా పెట్టడం కాదట. ఏకంగా నాలుగు ఎఫ్-16 యుద్ద విమానాలను గాల్లోకి పంపి... స్పైస్ జెట్ ను రౌండప్ చేయించిందట. ఈ క్రమంలో స్పైస్ జెట్ పైలట్ కాస్తంత సమయోచితంగా వ్యవహరించారు కాబట్టి సరిపోయింది గానీ... విను వీధిలో 120 మంది ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. పాక్ వైమానిక దళానికి చెందిన ఎప్-16 విమానాలు రౌండప్ చేసినా - వాటిలో నుంచి పాక్ సైనికులు స్పైస్ జెట్ ను దారి మళ్లించాలని మరీ బెదిరింపులకు గురి చేశారట.
పాక్ దుస్సాహసానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. గత నెల 23న 120 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ కు వెళ్లేందుకు టేకాఫ్ తీసుకున్న స్పైస్ జెట్ విమానం... పాక్ గగన తలంలోకి ప్రవేశించినంతనే పాక్ యుద్ధ విమానాలు దానిని రౌండప్ చేశాయట. ఆ విమానం ప్రైవేట్ ప్యాసింజర్ క్యారియర్ అన్న విషయం తెలిసి కూడా పాక్ సైన్యం దానిని రౌండప్ చేసిందట. అంతేకాకుండా ఆకాశంలోనే స్పైస్ జెట్ వివరాలు అందజేయాలని మన పైలట్ ను వేధించారట. అయితే మన పైలట్ ఏమాత్రం బెదిరిపోకుండా అది స్పైస్ జెట్ అని - ప్రైవేట్ ప్యాసింజర్ క్యారియర్ అని - 120 మంది ప్రయాణికులున్నారని వివరాలందించారట. ఆ తర్వాత విమానాన్ని దారి మళ్లించాలని పాక్ పైలట్లు ఇచ్చిన అల్టిమేటాన్ని స్పైస్ జెట్ పైలట్ పాటించకుండా... వివరాలను పదే పదే బిగ్గరగా చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లోనే పాక్ పైలట్లు వెనక్కు తగ్గారట. ఈ విషయాన్ని మన డీజీసీఏనే తాజాగా స్వయంగా వెల్లడించింది.