Begin typing your search above and press return to search.
కబాలి నిర్మాత డ్రగ్స్ కేసు డిటైల్స్ వచ్చేశాయి
By: Tupaki Desk | 14 Jun 2023 6:59 PM GMTసంచలనంగా మారిన కబాలి తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించిన క్రిష్ణ ప్రసాద్ డ్రగ్స్ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు వివరాలు వెల్లడించారు.బుధవారం ఉదయం ఆయన్ను డ్రగ్స్ తో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా ప్రకటించిన సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశామన్నారు. నిందితుడు క్రిష్ణ ప్రసాద్.. డ్రగ్స్ ను అమ్ముతున్న వేళలో ఆయన్ను పట్టుకున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్.. కారుతో పాటు రూ.2.05 లక్షల క్యాష్.. నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు.ఇక.. నిర్మాత క్రిష్ణ ప్రసాద్ డిటైల్స్ లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతగాడు బీటెక్ పూర్తి చేసిన తర్వాత పలు చోట్ల జాబ్స్ చేశారు. అయితే.. ఎందులోనూ కుదురుకున్నది లేదు. ఇలాంటి వేళలో.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తమిళ మూవీ కబాలి తెలుగువెర్షన్ డబ్బింగ్ హక్కుల్ని సొంతం చేసుకోవటంతో నిర్మాతగా అందరి కంట్లో పడ్డారు.
అయితే.. అంతకు ముందు పలు తెలుగు.. తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా క్రిష్ణప్రసాద్ పని చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. అర్జున్ సురవరం తదితర చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేసినా.. కబాలి చిత్ర నిర్మాతగా మాత్రం ఆయన అందరి నోట్లో నానారు. అయితే.. సినిమా రంగంలో తాను అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవటంతో డ్రగ్స్ దందాలోకి దిగారు. గోవాలోని ఒక పబ్ ను ప్రారంభించిన అతడు.. హైదరాబాద్ నుంచి అక్కడకు వచ్చే ప్రముఖులు.. సెలబ్రిటీలకు డ్రగ్స్ ను సరఫరా చేయటం షురూ చేశారు.
అయితే.. గోవాలోనూ నష్టాలు రావటంతో తిరిగి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. గోవా నుంచి వచ్చే ముందు నైజీరియన్ పెటిట్ యేజుబర్ నుంచి 100 పాకెట్ల కొకైన్ ను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. వాటిల్లో కొన్నింటికి వాడుకున్న అతడు.. మరికొన్నింటిని అమ్మే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు.
డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి.. సినీ నిర్మాతగా మారి గోవాలో పబ్ పెట్టి.. చివరకు డ్రగ్స్ దందాలో అరెస్టు అయ్యారు. ఇతగాడి వ్యవహారం టాలీవుడ్ లో ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారింది. ఇతడితో సంబంధాలున్న టాలీవుడ్ కనెక్షన్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.