Begin typing your search above and press return to search.

నన్ను ఎన్నుకోకపోతే అడుక్కుతింటారు : కే.ఏ.పాల్‌

By:  Tupaki Desk   |   26 May 2023 10:06 PM GMT
నన్ను ఎన్నుకోకపోతే అడుక్కుతింటారు : కే.ఏ.పాల్‌
X
ఏపీ ప్రజలపై కే.ఏ పాల్‌ మరోసారి విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపి ప్రజలు తనను ఎన్నుకోవాలని కోరారు. తమ పార్టీని కాదని అప్పులు చేసేవారిని ఎన్నుకుంటే ఎపి రాష్ట్ర ప్రజలు అడుక్కుతింటారని అన్నారు. దేవుడు ఇచ్చే మార్గాన్ని ఎంచుకోవాలని, కులాలు, మతాలకు అతీతంగా తమ పార్టీని గెలుపించుకోవాలని హితవు పలికారు.

ప్రజాశాంతి పార్టీని స్థాపించిన కే.ఏ.పాల్‌ 2019లో నర్సాపూర్‌ లోక్‌ సభ స్థానానికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. నర్సాపూర్‌ నియోజకవర్గంలో మొత్తం 1325028 ఓట్లు పోలవగా కే.ఏ.పాల్‌ కు 3037 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైనా ఫలితం దక్కలేదు. నామినేషన్‌ గడువు ముగియడంతో పాల్‌ నామినేషన్‌ ను తిరస్కరించారు రిటర్నింగ్‌ అధికారులు.

రాబోయే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని కే.ఎ.పాల్‌ రకరకాల కామెంట్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో నిలుస్తున్నాడు. మొన్న కర్ణాటక ఎలక్షన్ల గురించిన మాట్లాడిన కే.ఎ.పాల్‌ అక్కడ కాంగ్రెస్‌ విజయానికి తానే కారణమని చెప్పారు. కర్నాటకలో తాను కాంగ్రెస్‌కు మద్దతివ్వడం వల్లే అక్కడ గెలిచిందన్నారు. ఎలక్షన్లకు ముందు తాను కర్ణాటకకు వెళ్లి 53 వేల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశానని, బిజెపిని ఓడించేందుకు ఓట్లు చీల్చానని వివరించారు. తాను కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చినందున తెలంగాణ తమ పార్టీకి మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నేతలను కోరారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా ప్రజాశాంతి పార్టీకే ఉందని వివరించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఎలక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కే.ఎ.పాల్‌. వచ్చే ఎన్నికల్లో తనను కాదని అప్పు చేసేవాళ్లను ఎన్నుకుంటే అడుక్కుతింటారని అన్నారు. జగన్‌నూ, చంద్రబాబును ఓడించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. బుర్ర ఉన్నోళ్లే ప్రజాశాంతి పార్టీలో చేరుతారని పాల్‌ చెప్పారు. పాదయాత్ర చేసి లోకేష్‌కు పాదాలు అరిగిపోతున్నాయని, అది పాదయాత్ర కాదు.. డ్రామా యాత్ర అని విమర్శించారు.