Begin typing your search above and press return to search.

కేఏపాల్ ను అందరిముందే కడిగేసిన జర్నలిస్ట్

By:  Tupaki Desk   |   28 March 2019 10:39 AM GMT
కేఏపాల్ ను అందరిముందే కడిగేసిన జర్నలిస్ట్
X
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరి వివాదాస్పద రాజకీయ నాయకుడు ఎవరు? ఇన్నాళ్లు ఎవరూ లేరు.. కానీ ఇప్పుడు వర్మను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో కానీ.. ఆ పదానికి కరెక్ట్ గా సూటయ్యేలా ఒకరు వచ్చారు.. ఆయనే కేఏపాల్.. ఆయన చేసే సీరియస్ కామెడీ ఇప్పటికే జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించేస్తోంది..

కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పేరిట ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగారు. చిత్రవిచిత్రమైన వేషధారణలు, కామెంట్లు, చేష్టలతో ఈ రాజకీయ వేడికి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నారు. ఆ కోవలోనే ఓ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. తనకొచ్చిన ఇంగ్లీష్ సాంగ్ లో ముందుగా నిమిషంపాటు ఇరగదీశాడు.. ఇక పాల్ రెడీ ప్రశ్నలు అడ్డుక్కోండని జర్నలిస్టులకు ప్రకటించాడు.

దీంతో విలేకరులు ఎగబడ్డారు. ఓ టీవీ జర్నలిస్టు వరుసగా మూడు ప్రశ్నలు అడగడంతో చిర్రెత్తుకొచ్చిన పాల్ ‘నీకు బ్రెయిన్ ఉందా’ అని సదురు జర్నలిస్టుపై నోరుపారేసుకున్నాడు. పాల్ మాటలు నషాళానికి ఎక్కడంతో సదురు జర్నలిస్టు రెచ్చిపోయాడు.. ప్రజాస్వామ్యంలోకి వచ్చిన నేతవు.. ప్రెస్ మీటు పెట్టినప్పుడు ఎన్ని ప్రశ్నలకు అయినా సమాధానం ఇవ్వాలని.. ఇలా తప్పించుకుంటావా అని కేఏ పాల్ ను కడిగేశాడు. వేరే జర్నలిస్టులను పాల్ ప్రశ్నలు అడగమన్నా.. సదురు జర్నలిస్టు మాత్రం ఆ సమావేశాన్ని జరగకుండా పాల్ ను కడిగేయడం విశేషం. దీంతో సమాధానం చెప్పలేక పాల్ జారుకున్నాడు. విలేకరులంతా సదురు జర్నలిస్టును తిట్టిన దానికి పాల్ ను ఈ విషయంపై నిలదీయడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాల్ గారు అక్కడి నుంచి చల్లాగా జారుకున్నారు.ఇలా నోరు జారినందుకు కేఏ పాల్ గారు విలేకరులతో కూడా తిట్టించుకోవడం విశేషం.