Begin typing your search above and press return to search.
కరోనాపై యుద్ధానికి కదిలొచ్చిన కేఏ పాల్
By: Tupaki Desk | 17 March 2020 7:16 AM GMTప్రపంచానికే పెనుముప్పులా మారిన కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని దేశాల ప్రభుత్వలూ రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. క్వారంటైన్‌లు, ఐసోలేషన్ వార్డులు, అత్యాధునిక చికిత్సలతోపాటు... వైరస్ వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ పెరుగుతునే ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా స్పెషల్ అరేంజ్‌మెంట్స్ తో కరోనా పై యుద్ధం చేస్తోంది. ప్రభుత్వాలతో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీడియోలు, సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఇదేకోవలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తెలుగు ప్రజల కోసం సహృదయత చూపారు.
కరోనా బాధితులను ఆదుకునేందకు తన వంతు సహాయం చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. "దేశంలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. బాధితులకు నా వంతు సాయం చేసేందుకు సిద్ధం. మా సంస్థలకు సంగారెడ్డి లో 300 పడకల గదులు, విశాఖపట్నంలో 100 పడకల గదులు గల చారిటీ సిటిస్ ఉన్నాయి. వాటిని తెలుగు ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు. ఇందుకు డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వాడుకోవచ్చు" అంటూ ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు.