Begin typing your search above and press return to search.

కేసీఆర్ అరెస్టు ఖాయం.. ఏపీ సీఎం ముంచేశాడు.. కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 April 2022 3:30 PM GMT
కేసీఆర్ అరెస్టు ఖాయం.. ఏపీ సీఎం ముంచేశాడు.. కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. ప్ర‌పంచ శాంతి దూత కేఏ పాల్ రీఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో హడావుడి చేసిన త‌ర్వాత‌.. క‌నిపించ‌కుండా పోయారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు తెలుగు నాట అడుగు పెట్టిన ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే ఏపీ, త‌లెంగాణ ప్ర‌భుత్వాల‌పై శాపాలు పెట్టారు. తెలంగాణ‌లో కేసీఆర్ అరెస్టు అవుతార‌ని అన్నారు. ఏపీలో జ‌గ‌న్ పాల‌న అరాచ‌కంగా మారింద‌ని చెప్పారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీకి 30 సీట్లు కూడా రావ‌ని జోస్యం చెప్పారు. మొత్తానికి పాల్ వ‌చ్చీ రావ‌డంతోనే ఒక తుఫాను లాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్‌కు వ‌చ్చిన పాల్‌.. తొలుత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిప్డడారు.. కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదన్న ఆయన.. కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ``ప్రజాశాంతి పార్టీ తరపున తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరుగుతా… తెలంగాణలో కేసీఆర్ ముక్త్ పాలన రావాల``ని అని పిలుపునిచ్చారు.

తికాయ‌త్ నా శిష్యుడే!

రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ నా శిస్యుడే అని పాల్ చెప్పారు. ఆయన్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ కొత్త రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణ అభివృద్ధికి 1982 నుంచి తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు.. బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది.. అప్పుల తెలంగాణ మాత్రమే మిగిలింది.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీకి ఇప్పటి వరకు అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారు.? అని కేసీఆర్‌ని నిలదీశారు. ఇక, కేసీఆర్ నన్ను కలిశారు ఆశీస్సులు తీసుకున్నారు… కానీ, ఇప్పుడు 30 సీట్లు కూడా కేసీఆర్‌ గెలువడు. అని జోస్యం చెప్పారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లిపోయిందన్న పాల్.... మరో 20 ఏళ్లు ఎవరు పాలన చేసినా ఇబ్బందులే అని ఆవేదన వ్యక్తం చేశారు.. 18 పార్టీల నేతలు నేను కలిసి ఆగస్టు నెలలో సమావేశం పెట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో సాగుతోన్న జగన్మోహన్‌ రెడ్డి పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ తీవ్రంగా స్పందించారు. ఏడు లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి పోయిందని ఆరోపించారు.

మరో 20 సంవత్సరాలుగా ఏపీకి ఎవరు సీఎంగా ఉన్నా.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడడం ఖాయమని అన్నారు. దేశవ్యాప్తంగా 18 పార్టీలతో తాను సమావేశమైనట్లు వివరించారు పాల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.