Begin typing your search above and press return to search.

పాల్ చేసిన సేవల్ని గుర్తించండయ్యా?

By:  Tupaki Desk   |   23 Dec 2021 8:30 AM GMT
పాల్ చేసిన సేవల్ని గుర్తించండయ్యా?
X
విన్నంత సేపు వినోదానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మాటలు.. హావ భావాలు.. కలగలిపితే కేఏ పాల్ అవుతారు. తెలుగు గడ్డ మీద పుట్టిన అసమాన్యమైన వ్యక్తిగా ఆయన్ను చెప్పాలి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో అస్సలు అర్థం కాదు. ఆయన చెబితే.. మన పాల్ అక్కడ ఉన్నారా? అని ఆశ్చర్యపోవాల్సిందే. అంతేనా.. ఆయన మాటలు.. ఆయనకున్న కాంట్రాక్టు లిస్టు.. ఆయన చేసే పనుల చిట్టా వింటుంటే.. సినిమాల్లో చూసే సూపర్ మ్యాన్.. శక్తిమాన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటాయి. కానీ.. ఆయన్ను కామెడీ పీస్ గా.. ఆయన మాటల్ని చాలా సింపుల్ గా తేల్చేసేవారు తెలుగు నేల మీదనే కోట్లాది మంది కనిపిస్తారు.

కొంతకాలంగా మీడియాలో పెద్దగా కనిపించని కేఏ పాల్.. తాజాగా ఒక టీవీ చానల్ లైవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు వింటే..ఇలాంటివి ప్రపంచంలో పాల్ మాత్రమే చేస్తారని చెప్పక తప్పదు. తానెంత సర్వీస్ చేస్తున్నా.. ప్రజలు తనను గుర్తించటం లేదన్న వేదన ఆయన మాటల్లోకొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఎలాంటి ప్రతిఫలాక్ష లేకుండా ఇంత చేస్తున్న పాల్ ను కాస్త గుర్తించొచ్చు కదా? అన్న సందేహం కలుగక మానదు.

ఇంతకీ.. ఆయన చెప్పిన మాటల విన్నప్పుడు బాగానే ఉన్నా.. మధ్యలో అవసరం లేకున్నా ఆయన చేసే వ్యాఖ్యలు పంటి కింద రాయిలా మారి.. అరే.. ఇంత చిన్న విషయంలో ఇలా ఎలా మాట్లాడతార్రా సామి అనిపించక మానదు. అదే కేఏ పాల్ కు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో తాను చేసిన ఐదు ముఖ్యమైన పనుల గురించి చెప్పి.. దానికి సంబంధించిన రిఫెరెన్సులు ఇచ్చే తీరునోట మాట రాని రీతిలోఉంటుంది. ఎవరూ చేయని ఐదు పనులు తాను చేశానని చెప్పారు. ఇంతకూ ఆయన చేసిన ఆ ఐదు పనుల్ని ఆయన మాటల్లోనే చదివితే..

మొదటిది

2019 ఎన్నికలు అయ్యాక ఒక డైరెక్టర్ ఒక పిచ్చి సినిమా తీశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టటానికి. ఇంత మంది ఉన్నారు ఎవరైనా కోర్టుకు వెళ్లారా? ఫైట్ చేశారా? నెల రోజుల్లో ఫైట్ చేసి.. 16 ఎడిట్లు చేయించి.. టైటిల్ మార్పించా. ఆ సినిమా తీసినోడి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేశాం.

రెండోది

రూ.మూడున్నర లక్షల కోట్లు విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను రూ.మూడున్నర వేల కోట్లకు అమ్మేస్తున్నారంటే.. నా సొంత స్టీల్ ప్లాంట్ లా ఫీల్ అయ్యా. నేను పుట్టిన విశాఖకు అన్యాయం జరుగుతుందని భావించా. కోర్టుకు వెళ్లి కేసు పెట్టా. మా వాళ్లను పంపించా. అప్పట్లో శివాజీ మాట్లాడుతూ.. కేఏ పాల్ మాత్రమే దీన్ని అపగలరన్నారు. అప్పటికి శివాజీతోనాకు పరిచయమే లేదు.

మూడోది

పది.. ఇంటర్ పరీక్షలు ఎవరైనా కరోనా వేళలో పెడతారా? ఈ ఏపీ ముఖ్యమంత్రి తప్పించి. వయసులో పదేళ్లు చిన్నోడు అయినప్పటికీ ఆయన్ను కలవటానికి వెళ్లా. కానీ.. ఆయన కలవనన్నారు. పరీక్షలు నిర్వహించకూడదని నిరాహార దీక్ష చేశా. 20.. 30 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు జరగకుండా చేశా. పరీక్షలు జరిగితే కరోనా కేసులు ఎంత భారీగా పెరిగేవి. నా కారణంగా కోటి వరకు ఆంధ్రులకు మేలు కలిగేలా చేశా.

నాలుగోది

కరోనా టైంలో ఆర్ఎస్ఎస్.. బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందలాది స్వచ్చంద సంస్థల్ని మూసేశాయి. పలు క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి. అమిత్ షాతో ఫైట్ ఇచ్చి..రూపాలాతో మాట్లాడి 30 వేల ఎన్జీవో సంస్థల మీద పెట్టి పరిమితుల్ని ఎత్తేయించా. దాని కారణంగా ఐదు కోట్ల మంది సిబ్బందికి ఉపాధిని కల్పించిన వాడినయ్యా.

ఐదోది

ఫేస్ బుక్.. ట్విటర్ ను బ్యాన్ చేస్తానని కేంద్రం నోటీసులు ఇస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేసి.. కపిల్ సిబల్ ను లాయర్ గా పెట్టుకొని న్యాయం కోసం పోరాడాను. ఫేస్ బుక్.. ట్విటర్.. వాట్సాప్ లేకుంటే మొత్తం దేశానికి ఇబ్బంది అని ఫైట్ చేశా.

ఆరోది

మోడీ ప్రభుత్వం తీసుకొన్ని మూడు వ్యవసాయ చట్టాల్నిఎత్తేయించా. దేశంలో 70 శాతం మంది రైతులు ఉన్నారు. వారి శ్రేయస్సు కోసం ఏ పార్టీ ముందుకు రాకపోతే.. నేను ఓపెన్ గా రంగంలోకి దిగి.. ఢిల్లీ వచ్చి పెద్ద వాళ్లను కలిశా. పన్నెండు నెలలు మూడు చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశాను. కేంద్ర వ్యసాయ మంత్రి రూపాలాగారు నా దగ్గరకు వచ్చారు. ఢిల్లీ సింగ్రిల్లా హోటల్ కు వచ్చారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేశాను.