Begin typing your search above and press return to search.
సమరానికి పాల్ రెడీ.. మిగిలిన వాళ్ల సంగతేంటి.?
By: Tupaki Desk | 26 March 2019 5:05 PM GMTకేఏ పాల్ పైకి కామెడీగా కన్పిస్తున్నా కూడా కొన్ని విషయాల్లో అందరికంటే ఫాస్ట్ గా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గాజువాక - భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. నిన్నటివరకు కేఏ పాల్ కూడా ఒక అసెంబ్లీ - ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో నరసాపురం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసి వచ్చేసరికి టైమ్ అయిపోయింది. దీంతో భీమవరంలో నామినేషన్ వెయ్యకుండానే వెనక్కి వెళ్లిపోయాడు. అయితే.. ఇక్కడే పాల్ చాలా తెలివిగా వ్యవహరించాడు. ఇన్నాళ్లు మనకు తెలిసింది పాల్ నామినేషన్ వేసింది కేవలం నరసాపురం పార్లమెంట్ స్థానానికే అని అందరూ అనుకున్నారు. కానీ పాల్.. నరసాపురం అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. పాల్ వేసిన రెండు నామినేషన్లను అధికారులు ఆమోదించారు.
ఇన్నాళ్లు పాల్ సమరానికి సిద్ధంగా లేడు అన్నవాళ్లు కూడా అతడి ప్లాన్నింగ్ చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు నరసాపురంలో యుద్ధానికి పాల్ సిద్ధమయ్యాడు. కానీ పవన్ - జగన్ - చంద్రబాబు మాత్రం ఇంకా ప్రిపేర్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇంతవరకు టీడీపీ - వైసీపీ - జనసేన పార్టీ నేతలు నరసాపురం రాలేదు. ఎలాంటి ప్రచారం చేయలేదు. కానీ పాల్ మాత్రం ఆల్‌రెడీ నరసాపురంలో తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు ఫుల్ బిజీగా ఉంటున్నారు. అన్నింటికి మించి తనకు కచ్చితంగా పడే కాపు - క్రిస్టియన్ ఓట్లపై పాల్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. చంద్రబాబు - జగన్ - పవన్ కల్యాణ్ వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతూ మాటలు చెప్తున్నారు. కానీ పాల్ మాత్రం చేతల్లో తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. పాల్ గెలవడం అసాధ్యమే అయినా అతని పట్టుదలని మాత్రం చూసి అందరూ ముచ్చట పడుతున్నారు.