Begin typing your search above and press return to search.

కామెడీగా తీసుకుంటే పాల్ తో చిక్కే.. సీరియస్ పిల్ కు విచారణకు ఓకే!

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:00 AM GMT
కామెడీగా తీసుకుంటే పాల్ తో చిక్కే.. సీరియస్ పిల్ కు విచారణకు ఓకే!
X
కేఏ పాల్ అన్నంతనే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తుంది. ఆయన్ను చాలామంది సీరియస్ గా తీసుకోరు. ఆయన మాటలు.. చేతల పుణ్యమా అని అలాంటి పరిస్థితి. చాలామందికి కామెడీగా కనిపించే పాల్ కొన్నిసార్లు దిమ్మతిరిగేపోయేలా వ్యవహరిస్తుంటారు. ఆయన్ను అంత తేలిగ్గా తీసేయటానికి వీల్లేదన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. కాకుంటే అటిట్యూడ్ విషయంలో ఉన్న ఇబ్బందే ఆయన్నుకామెడీ పీస్ గా మార్చిందన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది.

ప్రజల సంగతిని కాసేపు పక్కన పెడితే.. రాజకీయ పార్టీలు ఆయన్ను పెద్దగా పట్టించుకోవు. ఇక.. అధికార పార్టీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారి వరకు కేఏ పాల్ కామెడీ పీస్ గా పలువురు టీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తుంటారు తమ సంభాషణల్లో.

అలాంటి కేఏ పాల్ కేసీఆర్ సర్కారుకు కస్సున దిగేలాంటి ఒక పిల్ ను తెలంగాణ హైకోర్టులో వేశారు. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఆ పిల్ వేసినట్లు చెబుతున్నారు. కొత్తగా కడుతున్న కొత్త సచివాలయంలోని అగ్నిప్రమాదంపై విచారణ కోసం పిల్ వేశారు.

అందులోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టిన రోజున సచివాలయాన్ని ఎలా ఓపెన్ చేస్తారని? అవసరమైతే రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ పుట్టినరోజున (ఏప్రిల్ 14న) ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వమని ఆయన కోరుతున్నారు.

జాతి అభివృద్ధి కోసం ప్రజలు చెల్లిస్తున్న పన్నులను దుర్వినియోగం చేస్తూ.. ఇప్పటికే ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరుతో కూల్చి కొత్తది నిర్మించారన్న వాదనను వినిపిస్తూ.. రూ.610 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని తన పుట్టినరోజున ప్రారంభించాలనుకోవటం ద్వారా ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారాన్ని పొందాలని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు.

కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ చీఫ్ జస్టిస్ బెంచ్ కు విన్నవించారు. దీంతో.. పాల్ దాఖలు చేసిన పిల్ కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్ కు కోర్టు ఆదేశాలు జారీ చేయటం.. దీంతో.. పాల్ వేసి పిల్ ఈ రోజు (మంగళవారం) విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి.. హైకోర్టు విచారణలో కేసీఆర్ సర్కారుకు ఏ మాత్రం చురుకు తగిలేలా హైకోర్టు వ్యాఖ్యలు వస్తే.. అదంతా కేఏ పాల్ పుణ్యమేనని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.