Begin typing your search above and press return to search.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఒక్క ఎంపీనీ గెలిపించలేరు: పాల్ జోస్యం

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:30 PM GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఒక్క ఎంపీనీ గెలిపించలేరు:  పాల్ జోస్యం
X
పొలిటిక‌ల్ క‌మెడియ‌న్‌గా ముద్ర‌ప‌డిన కేఏ పాల్‌.. తాజాగా మ‌రిన్ని జోకులు పేల్చార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును కూడా గెలిపించుకునే ప‌రిస్థితి లేద‌న్నారు. అసలు ఆయ‌నే త‌న‌పై త‌ను న‌మ్మ‌కం కోల్పోయి.. నియోజ‌క‌వ‌ర్గం మార్చుకునే ప‌నిలో ప‌డ్డార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాలు స‌రిగాలేవ‌ని.. ఎవ‌రిలోనూ నిల‌క‌డ లేద‌ని.. ఒక‌రిపై ఒక‌రికి అప‌న‌మ్మ‌కం పెరిగిపోయింద‌ని.. అందుకే తాను రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మోడీ నిల‌బెట్టిన అబ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు పాల్ చెప్పారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని.. ప్రధాని మోడీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  వెల్లడించారు.  ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని మోడీ, షాల‌ను కోరానన్నారు. బీజేపీ అభ్యర్ధే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. తాను కూడా మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు చెప్పారు.  రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలన్నారు. ప్రతిపక్షాలు వేరు వేరు కుటములుగా ఉండొద్దని పాల్ సూచించారు.

''నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటా నికి ఇష్టపడటం లేదు. బీజేపీ అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. కానీ, బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తా. బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం నాశనం అయిపోతోంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బీజేపీ బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకి ప్రతిపాదించా`` అని అన్నారు.

``దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ, అమిత్ షా, పురుషోత్తం రూపాలకు తెలిపా. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కుటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్ తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించా. అయినా.. ఆయ‌న నుంచి స్పంద‌న రాలేదు. కేసీఆర్ మ‌న‌సులో ఒక‌టి.. బయ‌ట‌కు ఒక‌టి మాట్లాడే ముఖ్య‌మంత్రి. కేసీఆర్‌కి వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఉండరు'' అని పాల్ కామెంట్లు చేశారు.