Begin typing your search above and press return to search.

కె.ఏ.పాల్ సరికొత్త అవతారం.. ప్రపంచం కోసం ఏంచేస్తున్నాడంటే ..?

By:  Tupaki Desk   |   9 Nov 2019 12:11 PM GMT
కె.ఏ.పాల్ సరికొత్త అవతారం.. ప్రపంచం కోసం ఏంచేస్తున్నాడంటే ..?
X
కె.ఏ.పాల్ ఈ పేరు వినగానే ..ఎలాంటి వారి మొఖంలో అయినా కూడా నవ్వు కనపడాల్సిందే. ఎందుకు అంటే అయన మాటలు ఆలా ఉంటాయి మరి. కె.ఏ.పాల్ నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా అని భావిస్తాడు కానీ , అయన మాటలు వింటున్న వారు మాత్రం ..కామెడీగా తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఆయనే కామెడీ చేస్తాడు ..ఎప్పుడు ఏంచేస్తాడో ..మనకే కాదు ఆయనకి కూడా తెలియదు. అందుకే అందరూ ఆయన్ని కె ఏ పాల్ అంటారు. అయన స్పీచ్ వింటే పడి పడి నవ్వుకోవాల్సిందే. గత 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాబోయే సీఎం నేనే అంటూ తెగ హడావిడి చేసి పాల్ ..ఎన్నికల ఫలితాల అనంతరం అడ్రస్ లేకుండా పోయాడు.

ఎన్నికల ప్రచారం లో మాట్లాడుతూ ..నన్ను మీరు గెలిపించి సీఎం ని చేస్తే ఏపీని మరో అమెరికా చేస్తా అని చెప్పాడు.కానీ , ఫలితాల అనంతరం అడ్రస్ లేకుండా పోవడంతో పాల్ ఎక్కడ అంటూ అందరూ తెగ ఫీల్ అయ్యారు. ఇంతలో పాల్ వీడియో ఒకటి నెట్ లో ప్రత్యక్షం అయ్యింది. నేను ఒక ముఖ్యమైన పని మీద అమెరికా వచ్చినట్టు తెలిపాడు. ప్రజాశాంతి పార్టీ తరపు ఆయన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ. లోక్‌సభ స్థానాలు నుంచి పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేస్తే.. 281 ఓట్లు.. లోక్‌సభకు పోటీ చేస్తే 3037 ఓట్లు వచ్చాయి. ఆయనకంటే స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం.

ఎన్నికల తరువాత పాల్ కనిపించకుండా పోవడం తో అందరూ ఫీల్ అయ్యారు. ఈ సమయంలో పాల్‌ అమెరికా నుంచి ఫేస్‌బుక్ లైవ్‌లో కి వచ్చాడు. తాను అతిపెద్ద టాస్క్‌లో యమా బిజీగా వున్నానన్నది ఆయన వీడియో సందేశం సారాంశం. ఇంతకీ ఆ టాస్క్ ఏంటీ అంటే ప్రపంచం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం ముంగిట్లో వుందని, దాన్ని నివారించడం ద్వారా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నానని కె.ఏ.పాల్ చెప్పుకున్నారు. అందుకోసం ప్రపంచాధినేతలను కలుస్తున్నానని.. తన అపాయింట్‌మెంట్ కోసం డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వెయిట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు కె.ఏ.పాల్.