Begin typing your search above and press return to search.

కేఏ పాల్ కామెడీ.. ఉపప్రధాని పదవి ఇస్తానన్నారట..

By:  Tupaki Desk   |   24 April 2022 2:30 AM GMT
కేఏ పాల్ కామెడీ.. ఉపప్రధాని పదవి ఇస్తానన్నారట..
X
పాఫం పాల్.. అమెరికాలో ఇన్నాళ్లు సేదతీరి.. ఇప్పుడు మండే ఎండల్లో తెలంగాణలో రోడ్డునపడ్డాడు. తెలంగాణలోని సమస్యలపై పోరుబాటకు శ్రీకారం చుట్టాడు.ఇప్పుడు ఇన్నాళ్లుగా గుర్తుకురాని తెలంగాణ సమస్యలు సడెన్ గా గుర్తుకు వచ్చేసరికి మళ్లీ ఏపీలో ప్రత్యక్షమయ్యాడు పాల్. తాజాగా తెలంగాణ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.

అభివృద్ధి కోసమే తాను అప్పట్లో తెలంగాణకు మద్దతిచ్చానని.. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని కేఏపాల్ వాపోయారు. రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. కేటీఆర్ బీజేపీ తప్పులను ఎత్తి చూపుతున్నారని.. టీఆర్ఎస్ తప్పులను ఎందుకు కప్పి ఉంచుతున్నారని ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పుతోందని.. పోటీ పడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచిపెట్టారని అన్నారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడిందన్నారు.

ఇక బీజేపీ నాకు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చి ఉప ప్రధాని చేస్తానని ఆఫర్ ఇచ్చిందని.. కానీ నేను ఒప్పుకోలేదని అన్నారు. డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇప్పుడు అధికార పార్టీలకు ఓటు వేయవద్దు అని అన్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తా.. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరన్నారు. నా ప్రతిభ గురించి తెలిసే మోడీ, కేసీఆర్, జగన్ భయపడుతారు.

కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ ఇకనైనా గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానన్నారు. ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశానన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోవాలన్నదే నా అభిమతం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్ లో 102 సీట్లు వస్తాయని కేఏ పాల్ అన్నారు.