Begin typing your search above and press return to search.

పాల్ క్యామెడీ పీక్ లెవిల్‌.. న‌వ్వు ఆపుకోలేరు బ్రో.. నిజం!

By:  Tupaki Desk   |   12 Feb 2023 9:26 PM GMT
పాల్ క్యామెడీ పీక్ లెవిల్‌.. న‌వ్వు ఆపుకోలేరు బ్రో.. నిజం!
X
పొలిటిక‌ల్ కామెండీ కింగ్ కే ఏ పాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఏం మాట్టాడినా.. న‌వ్వుల జ‌ల్లు కురుస్తూ నే ఉంటుంది. ఎందుకంటే.. ఆయ‌న చేసే కామెంట్లే అలా ఉంటాయి. ఇది ఆయ‌న త‌ప్పు కాదు.. ఆయ‌న ఆలోచ‌నా విధానం కావొచ్చు. తాజాగా ఈ క్యామెడీని పీక్ లెవిల్‌కి తీసుకువెళ్లిపోయారు.. పాల్‌. బీఆర్ ఎస్ అంటే.. తెలంగాణ అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. త‌న‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని... అయితే.. తానే స‌మ‌యం కోసం వేచి చూడ‌మ‌ని చెప్పాన‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. దీనికి ముందుగా కేఏ పాల్ కేసీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంట‌నే ఒదానెమ్మ‌ట ఒక‌టిగా విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ మారాలని కోరుకుంటున్నానని, ఆయన వెళ్లే మార్గం సైతన్ మార్గమని వ్యాఖ్యానించారు.

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా.. అప్పులు లేని తెలంగాణ చేయాలని 9 ఏళ్లుగా కేసీఆర్‌ను కోరుతున్నా నని అన్నారు. మార్పు చెందకపోతే ముఖ్యమంత్రి పతనం ఆరంభం అవుతుందని చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతోంద న్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయ ప్రారభోత్సవం విషయంలో వెనక్కి తగ్గారని పాల్ వ్యాఖ్యానించారు. అంటే ముఖ్యమంత్రి ఓడిపోయారని.. అంబెద్కర్ గెలిచారని.. బడుగు బలహీన వర్గాలు గెలిచాయని కేఏ పాల్ కొత్త వ్యాఖ్య‌లు చేశారు.

రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం చేశారని పాల్‌ విమర్శించారు. అంబెద్కర్ జయంతి ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తనకు భద్రత తన దేవుడేనని అన్నారు. సీఎం కేసీఆర్.. త‌న‌పైనా.. ప్రధాని మోడీపైనా దాడులు చేస్తున్నారని.. అయినా తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. తనను అరెస్టు చేసినా.. దాడులు చేసినా భయపడనని కేఏ పాల్ అన్నారు.

ముఖ్యమంత్రిపై కలిసి పోరాడటానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపిచ్చారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. దేశాన్ని అమ్మేసింది.. నాశనం చేసింది బీజేపీయేనని, ప్రధాని మోడీ దేశాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకున్నానని చెప్పారు. తాము ఎమ్మెల్యేలను కొనమని.. నిజాయితీగా ఉన్నవారు ఎవరైనా ప్రజాశాంతి పార్టీలో చేరవచ్చునని పాల్ పిలుపిచ్చారు. మొత్తానికి ఈ కామెంట్లు న‌వ్వులు కురిపిస్తున్నాయి.