Begin typing your search above and press return to search.
30 నిమిషాలిస్తే.. ఏపీ అప్పులు తీర్చేస్తా.. కేఏ పాల్
By: Tupaki Desk | 18 Dec 2022 11:32 AM GMTకేఏ పాల్. కిందపడ్డా పైచేయి నాదే అనేటైపు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో ఆయన వేసిన వేషాలు.. చేసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కాదు.వార్ వన్ సైడే అంటూ.. భయంకరమైన ఎన్నికల వేడిలో నవ్వుల పువ్వులు పూయించారు. ఇక, ఆ ఎన్నికలో ఆయనకు వెయ్యి ఓట్లు కూడా పడని విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు రంగం ఏపీకి మారినట్టుగా కనిపిస్తోంది. అందుకే తాజాగా పాల్ ఏపీ సెంట్రిక్‌గా సంచలన కామెంట్లు చేశారు.
నాకు ఒక్క అవకాశం ఇస్తే.. 30 నిమిషాల్లోనే ఏపీ చేసిన అప్పులు మొత్తం తీర్చేసి.. ఉద్యోగాలుకూడా కల్పి స్తా.. అంటూ.. కామెంట్ల వర్షాన్ని కుమ్మేస్తున్నారు. అంతేకాదు.. ఏపీలో తనను 60 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జగన్.. టీడీపీని ఇబ్బంది పెడుతున్న వైనంపైనా ఆయన తనదైన శైలిలో కామెంట్లు చేశారు. గతంలో చంద్రబాబు ఇబ్బంది పెట్టబట్టే.. ఇప్పుడు జగన్ ఇబ్బంది పెడుతున్నారని సమర్థింపు వ్యాఖ్యలు చేశారు.
ఇక, కేంద్రంలోని మోడీ సర్కారుకు చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ.. కూడా మసాజ్ చేస్తున్నారని సంచల న వ్యాఖ్యలు చేశారు. ``జగన్ నాకు 30 నిమిషాల సమయం ఇస్తే.. ఏపీ తలరాత మార్చేస్తా`` అని పాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. ప్రత్యేక హోదా తెస్తామన్నారని..కానీ, ఏమైందని ఆయన ప్రశ్నించారు.
కుల కుటుంబ పార్టీలు తమకు అవసరం లేదని.. వాటితో తమకు లాభం లేదని.. ఏపీ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని పాల్ జోస్యం చెప్పారు. చంద్రబాబు తన కుమారుడి కోసం అహర్నిశలు కష్టపడుతు న్నారని.. వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని పాల్ ఉద్ఘాటించారు. మొత్తానికి పాల్ కామెంట్లు వింటే.. తగ్గేదేలే.. అన్నట్టుగా ఉందని అంటున్నారు నెటిజన్లు.