Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌న్నా చిరు డ్యాన్స్ సూప‌ర్‌...ఓట్లు మాత్రం నాకే

By:  Tupaki Desk   |   20 March 2019 4:02 PM GMT
ప‌వ‌న్ క‌న్నా చిరు డ్యాన్స్ సూప‌ర్‌...ఓట్లు మాత్రం నాకే
X
యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు... మొత్తం కేఏ పాల్ హ‌డావుడే. ఎన్నికల సమయంలో బోలెడంత కామెడీ చేసి మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ ఏపీ ఎన్నిక‌ల్లో బోర్ కొట్ట‌కుండా ఎంట‌ర్‌ టైన్ చేస్తున్నాడు ఆయ‌న‌. గంగిరెద్దులు వాళ్లు సంక్రాంతికి మాత్రమే వస్తారు. కేఏ పాల్‌ కూడా అంతే.. ఎన్నికల టైమ్‌లోనే వచ్చేస్తారు. బోలెడంత వినోదం పంచి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. గత రెండు నెలలుగా పిచ్చపిచ్చగా కామెడీ చేస్తున్న పాల్‌.. ఇప్పుడు స్టేజ్‌ పై డ్యాన్సులు కూడా వేస్తున్నారు.

నరసాపురంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మీటింగ్‌ కు హాజరయ్యారు పాల్‌. అక్కడ మీటింగ్‌ కు వచ్చిన వాళ్లని ఉద్దేశిస్తూ.. చాలా సరదాగా మాట్లాడి కాసేపు కామెడీ చేశారు. “వచ్చే ఎన్నికల్లో జగన్‌ కు అస్సలు ఓటు వెయ్యెద్దు. ఇప్పటికే చాలా దోచుకున్నాడు ఇంకా దోచుకుంటాడు. ఇక పవన్‌ కల్యాణ్‌.. ఇలా ఇలా డ్యాన్సులు వేస్తాడు. ఈయన కన్నా వాళ్ల అన్నయ్య నయం. డ్యాన్సులు సూపర్‌ గా చేస్తాడు. ఈయన 21 సీట్లు బీఎస్పీకి ఇచ్చాడు. బీఎస్పీ ఒక పార్టీయా అండీ?. మాయావతి నా శిష్యురాలు. ఇక సీపీఎం సీపీఐలకు సీట్లు ఇస్తాడు. వాటిని కూడా పార్టీలు అంటారా. అందుకే హెలికాప్టర్‌ గుర్తుకు ఓటెయ్యండి. చంద్రబాబుకు ఓటు వెయ్యెద్దు - జగన్‌ కు వెయ్యెద్దు - పవన్‌ కల్యాణ్‌కు అసలే వెయ్యెద్దు” అంటూ మధ్యమధ్యలో చిన్న చిన్న డ్యాన్సుల వేస్తూ అందర్ని నవ్వించారు పొలిటిక‌ల్‌ కామెడీ కింగ్‌ కేఏ పాల్‌.