Begin typing your search above and press return to search.
టెక్నాలజీ ఇవ్వమన్నోళ్లకు కొవాగ్జిన్ భలేగా కౌంటర్ ఇచ్చిందిగా?
By: Tupaki Desk | 14 May 2021 12:30 PM GMTడిమాండ్ భారీగా ఉన్నప్పుడు.. దానికి చెక్ పెట్టేందుకు ఉత్పత్తిని పెంచితే పోతుంది. అయితే.. అన్ని అనుకున్నంత ఈజీ కాదు. అందునా వ్యాక్సిన్ తయారీ సంక్లిష్టమైనది. టీకాల కొరత ఈ రోజున దేశాన్ని పట్టిపీడించటం ఇవాల్టికి ఇవాళ మొదలైన అంశం కాదు. నెలల తరబడి పాలకులు పట్టించుకోకపోవటంతో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితి. దీనికి అవసరమైన పరిష్కారం చేయాలే తప్పించి.. భావోద్వేగ అంశాల్ని తీసుకొచ్చేస్తే సొల్యూషన్ రాదు. ఆ విషయాన్ని మర్చిపోయి.. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ సాంకేతికతను మిగిలిన కంపెనీలతో పంచుకోవాలన్న వాదన ఒకటి మొదలైంది.
దీనిపై భారత్ బయోటెక్ అస్సలు స్పందించలేదు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తాజాగా ఈ అంశంపై రియాక్టు అయ్యారు. సాంకేతికత బదలాయింపు వాదనకు చెక్ పెడుతూ.. భారత్ బయోటెక్ మంచితనం గురించి ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొవాగ్జిన్ సాంకేతికతను బదిలీ చేయటానికి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందని.. ఎవరైనా ముందుకు వస్తే స్వాగతిస్తామని తమతో వారు చెప్పినట్లు పాల్ చెప్పారు.
నిజానికి భారత్ బయోటెక్ చొరవ కారణంగానే.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆఫ్కిన్.. విప్కాల్.. ఇండియన్ ఇమ్యునలాజికల్ సంస్థలు టీకా ఉత్పత్తి చేయటానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. బతికి ఉన్న వైరస్ ను నిర్వీర్యం చేసి.. అద్భుతమైన టీకాను భారత్ బయోటెక్ తయారు చేసిందని.. ఐసీఎంఆర్ తో కలిసి రూపొందించిన ఈ టీకా తయారీకి బయోసేఫ్టీ లెవెల్ 3 లేబొరేటరీ ఉన్న చోటనే సాధ్యమవుతుందని చెప్పారు.
ఆ తరహా ల్యాబులు మరే సంస్థ దగ్గరా లేవని.. అందుకే.. ఎవరైనా ముందుకు వస్తే వారికి ప్రభుత్వం నుంచి కూడా సహకారం కూడా అందిస్తుందని.. భారత్ బయోటెక్ పూర్తి సానుకూలతతో చర్యలు తీసుకుంటుందన్నారు. టీకా ఉత్పత్తి మీద ఉన్న అపోహల్ని తొలగించటానికి తానీ వివరణ చెబుతున్నట్లుగా చెప్పారు.
భారత వ్యాక్సిన్ కంపెనీల మీద రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయని.. వారి కఠోర శ్రమ వల్లే ఎవరి మీదా ఆధారపడకుండా ప్రజలకు టీకా అందిస్తున్నామని.. సదరు కంపెనీల కార్మికుల.. శాస్త్రవేత్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయకూడదన్న మాట విన్నప్పుడు.. సాంకేతిక బదిలీ మాటకు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు. తన మీద వస్తున్న విమర్శలకు నేరుగా స్పందించే అలవాటు లేని భారత్ బయోటెక్.. చెప్పాల్సిన వారి చేత చెప్పించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.