Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల్లో యూట్యూబ్ స్టార్ ఆయనే!

By:  Tupaki Desk   |   3 April 2019 5:57 AM GMT
ఏపీ ఎన్నికల్లో యూట్యూబ్ స్టార్ ఆయనే!
X
ఎన్నికల వేళ జనాలకు వేడెక్కించే రాజకీయమే కాదు.. వారు సరదాగా నవ్వుకునే రాజకీయం కూడా అవసరమే! ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలను జనాలు ఎమోషనల్ గా తీసుకుంటారు. అందరూ కాకపోయినా తాము అభిమానించే పార్టీనే నెగ్గాలని కోరుకునే వారి శాతం ఎక్కువ! రాజకీయాలను అంత సీరియస్ గా తీసుకుంటారిక్కడ. దీంతో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరిపోయింది. నోటిఫికేషన్ వచ్చే సమయానికే అది పీక్స్ కు చేరింది. ఆ తర్వాత కూడా వేడి తగ్గడం లేదు! రోజు రోజుకు పెరుగుతూ పోతోంది.

ఇలాంటి రాజకీయ వేడిలో జనాలకు కాస్తంత రిలీఫ్ కేఏ పాల్. ఇప్పుడు టీవీ చానళ్లు పాల్ ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అవి సీరియస్ పాలిటిక్స్ మీద పడిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పాల్ స్టార్ అయిపోయాడు. కేఏ పాల్ కామెడీ వీడియోలు యూట్యూబ్ ట్రెండ్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో కేఏ పాల్ వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వాదనలు. ఆ తర్వాత పబ్లిక్ గా ఆయన చేసిన డ్యాన్సులు, కిక్ బాక్సింగ్ స్టెప్పులకు సంబంధించిన వీడియోలు వెబ్ లో వైరల్ గా మారాయి. అవి జనాలను ఒక రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నాయి.

బహుశా ఏపీ రాజకీయాల్లో ఈ స్థాయిలో కామెడీ పండించిన వారు ఎవరూ లేరు. ఎంతో మంది రాజకీయాలకు వచ్చారు, వెళ్లారు కానీ.. కేఏ పాల్ ల తమ స్టేట్ మెంట్స్ తో అలరించిన వారు ఇంకొకరు లేరు. తను నవ్వకుండా జోకులు వేసేశారే సిసలైన కమేడియన్ అవుతారు. అలాంటిది అంత సీరియస్ గా జోకులు వేసే కేఏ పాల్ కు మించిన విదూషకుడు ఎవరు ఉంటారు?

ఒకటని కాదు రెండని కాదు..కేఏ పాల్ కు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక జర్నలిస్టుతో కేఏ పాల్ వాగ్వాదం, ప్రపంచ శాంతి గురించి, యుద్ధాలను ఆపడం గురించి ఆయన చెప్పుకున్న మాటలు, పవన్ కల్యాణ్ ను అనుకరిస్తూ పాల్ చేసిన డ్యాన్సులు - చంద్రబాబు - జగన్ ల మీద ఆయన చేసిన విమర్శలు.. ఏదీ ఒకదానికి మరోటి తక్కువ కాని రీతిలో నవ్విస్తున్నాయి.

యూట్యూబ్ లో వీటికి ఫుల్ వ్యూస్ ఉన్నాయి. దీంతో చిన్నా చితక యూట్యూబ్ చానళ్లు కూడా కేఏ పాల్ వెంట పడుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో కేఏ పాల్ ను యూట్యూబ్ స్టార్ గా చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి!