Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై కేఏ పాల్ కేసు

By:  Tupaki Desk   |   28 April 2023 1:00 PM GMT
విశాఖ ఉక్కుపై కేఏ పాల్ కేసు
X
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాలే నయమోమే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాల్ అమరావతి హైకోర్టులో కేసు వేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను దాఖలుచేసిన పిటీషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని పాల్ రిక్వెస్టు చేసుకున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించటానికి అవసరమైన మార్గంలో స్పీడుగా వెళిపోతోంది. దీన్ని ఫ్యాక్టరీలోని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీళ్ళకి స్ధానికంగా ఉన్న ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు మద్దతుగా నిలబడ్డాయి.

అయితే అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేతలు ఏదో కంటితుడుపుగా మాత్రమే కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తున్నారు. పై పార్టీల్లో ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులో కేసు దాఖలుచేయలేదు.

నిజానికి వైసీపీ లేదా టీడీపీలు కోర్టులో కేసు వేస్తే దానికత వేరేరకంగా ఉంటుంది. ఎందుకంటే రెండుకూడా బలమైన పార్టీలు కూడా కోర్టు విచారణలో ప్రభావం కనబడుతుంది. అలాకాకుండా వ్యక్తిగత హోదాలో జేడీ లక్ష్మీనారాయణో లేకపోతే కేఏ పాల్ కేసు వేస్తే అందులో తీవ్రత ఏముంటుంది ?

సరే ఏదేమైనా పాల్ కేసు వేశారు కాబట్టి హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది. అయితే అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో అత్యవసరం అనేది ఏమీలేదని కాబట్టి వేసవి సెలవుల తర్వాత విచారణకు స్వీకరిస్తామని స్పష్టంగా ప్రకటించింది. పాల్ అమెరికా వెళ్ళినా ఆన్ లైన్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామనే వెసులుబాటు ఇచ్చింది. దాంతో పాల్ కు ఏమిచేయాలో అర్ధంకాలేదు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులకు, వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో పాల్ తన పిటీషన్లో వివరించారు. ప్రైవేటు వ్యక్తులకు నామమాత్రపు విలువకే ప్లాంటును కట్టబెట్టే కుట్ర జరుగుతోందని పాల్ ఆరోపించారు.

సరే పాల్ ఆరోపణలు, నిధుల సేకరణ మార్గాలకు హైకోర్టు ఎంతవరకు అంగీకరిస్తుందో తెలీదు. ఏదేమైనా నరేంద్రమోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా పాల్ కోర్టులో కేసు వేయటమే చాలా ఎక్కువని చెప్పాలి.