Begin typing your search above and press return to search.

స్వామీగౌడ్ కూడా నలుగురే అంటున్నారు!

By:  Tupaki Desk   |   13 April 2015 5:04 AM GMT
స్వామీగౌడ్ కూడా నలుగురే అంటున్నారు!
X
ప్రతీ హిందూ మహిళా కనీసం నలుగురికి తక్కువ కాకుండా పిల్లలను కనాలని మాట్లాడిన బీజేపీ, వి.హెచ్.పి. నేతలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తిన విషయం తెలిసిందే! ఉన్న జాతిని ఉద్దరించే ఆలోచనలో ఆసక్తి, ఆతృత ఉండదు కానీ... తినడానికి తిండి, ఉండటానికి గూడు లేకపోయినా కూడా జాతి మొత్తం ఫుల్ జనాభాతో ఉండాలని కలలుకంటుంటారు! ఈ లిస్ట్ లో చేరిపోవాలనుకున్నారు స్వామి గౌడ్! అదే స్థాయిలో ప్రచారం పొందాలనుకున్నారో లేక హిందూ జాతి అంతరించిపోతుందని కలగన్నారో తెలియదు కానీ... స్వామి గౌడ్ కూడా అదేపాట అందుకున్నారు!
దేశంలో హిందూ జాతి మిగలాలంటే ఇంటికి నలుగురు పిల్లలను కనాలని, లేకపోతే జాతి మనుగడ సాగించదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అంటున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి అభివృద్దికి, జాతి మనుగడకి, జాతి బలానికి కేవలం జానాభా అధికంగా ఉండటమే ప్రాతిపధిక అని ఫీలయ్యే నేతలపై అటు సామాజిక కార్యకర్తలు, ఇటు మహిళా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశానికి ఉన్న అతి పెద్ద సమస్యల్లో... జనాభ అతిపెద్ద సమస్య. ఈ విషయం తెలిసి మాట్లాడుతున్నారా? అయినా పర్లేదు కానీ... హిందూ జనాభా ఎక్కువ ఉండాలని మాట్లాడుతున్నారో తెలియదు కానీ... ఇటువంటి సంకేతాలు ప్రజల్లోకి పంపకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు!