Begin typing your search above and press return to search.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కాదు... మ‌ద్యాంధ్ర‌ప్ర‌దేశ్‌!

By:  Tupaki Desk   |   20 Jun 2017 8:15 AM GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కాదు... మ‌ద్యాంధ్ర‌ప్ర‌దేశ్‌!
X
సీఎం చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ ను మద్యాంధ్రప్రదేశ్‌ గా మార్చేశారని వైసీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని తెలియ‌డంతో త‌న‌ కుటుంబ సభ్యులు - అనుచరులు - పార్టీ నేతలకు రాష్ట్ర ఆదాయ వనరులను క‌ట్ట‌బెట్టాల‌న్న భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌న్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమ‌వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ప్రజా సమస్యల పరిష్కారం కన్నా రాష్ట్రాన్ని దోచుకోవ‌డం పై చంద్రబాబు ఆస‌క్తి చూపుతున్నార‌ని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చేసిన ఐదు సంతకాలను విస్మ‌రించార‌న్నారు. బెల్టుషాపులను నిర్మూలన ఫైలుపై సంత‌కం చేసిన చంద్ర‌బాబు.... టీడీపీ కార్యకర్తలకు వాటిని అప్పగించార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కాగా, అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్‌ సీపీ నేతలు ధ్వజమెత్తారు. కడప జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ తన మేనిఫెస్టోలో 600 హామీలతో కూడిన బుక్‌ లెట్‌ విడుదల చేసిందన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్ర‌బాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేద‌న్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆ హామీలను నెరవవేర్చలేదని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనేతలపైన, ప్రజలపైన కేసులు పెట్టారన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/