Begin typing your search above and press return to search.
జడేజాకి బదులుగా చహల్ ను ఎలా తెస్తారు? ఆస్ట్రేలియా కోచ్ ఫైర్
By: Tupaki Desk | 5 Dec 2020 3:53 AM GMTఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సీరిస్ మొదటి మ్యాచ్ లో భారత 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యజువేంద్ర చాహల్‌ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ఫైర్ అయ్యారు. రిఫరీ డేవిడ్ బూన్‌తో వాదనకు దిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లను నష్టపోయి 150 పరుగులు మాత్రమే సాధించింది.
అయితే భారత్ బ్యాటింగ్ చేస్తుండగా 19 ఓవర్లో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ విసిరిన రెండో బంతి జడేజా హెల్మెట్‌కు తాకింది. దీంతో అతడు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వేసిన మరోబంతితో అతడి తొడకండరాలకు గాయమైంది. అయితే జడేజా తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి స్థానంలో కోహ్లీ యజువేంద్ర చావల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్ గా తీసుకొచ్చారు. దీనిపై ఆస్ట్రేలియా కోచ్ అభ్యంతరం తెలిపారు. బ్యాట్స్‌మెన్ స్థానంలో బౌలర్‌ను ఎలా తీసుకొస్తారంటూ ఆయన ప్రశ్నించారు. కానీ రిఫరీ మాత్రం తాను రూల్ ప్రకారమే నడుకుంటున్నానని.. ఓ బ్యాట్స్‌మెన్ స్థానంలో బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ ఎవరైనా రావవచ్చని రిఫరీ డేవిడ్ బౌన్ సర్ది చెప్పాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియా కోచర్ లాంగర్ వినలేదు. అతడితో తీవ్ర వాదనకు దిగాడు. చహల్ రావడంపై కెప్టెన్ అరోన్ ఫించ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ చహల్‌ను అనుమతించారు. ఆస్ట్రేలియా కెప్టెన్, కోచ్‌లు వాగ్వాదానికి దిగడం కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే చహల్ భారతవిజయంలో కీలకపాత్ర పోషించడం గమనార్హం.
తొలి రెండు ఓవర్లలో అరోన్ ఫించ్ (35), స్టీవ్ స్మిత్ (12).. ఆ తర్వాత వేడ్ (7) వికెట్లని పడగొట్టాడు. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌ని గత ఏడాది ఆగస్టులో తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం.. కాంకషన్‌కి గురైన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చే క్రికెటర్ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అర్హుడు.