Begin typing your search above and press return to search.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్
By: Tupaki Desk | 18 Nov 2015 4:44 PM GMTసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ఖరారు చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దత్తు 14 నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్న పదవీ కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో ఠాకూర్ నియామకం జరిగింది. డిసెంబరు 2న ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాజ్యాంగ నిబంధలన ప్రకారం సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న జడ్జీ...సర్వోన్నత న్యాయస్థానంలోని జడ్జీల నుంచి సీనియర్ న్యాయమూర్తిని గుర్తించి ఆయన పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఆ ఫైలును న్యాయశాఖ క్షుణ్ణంగా పరిశీలించి ప్రధానమంత్రికి పంపిస్తుంది. ప్రధాని ఓకే చేసిన తర్వాత రాష్ర్టపతి వద్దకు ఈ ఫైల్ చేరుతుంది. దేశాధ్యక్షుడి గ్రీన్ సిగ్నల్‌తో కొత్త సీజే నియామకం ప్రక్రియ పూర్తవుతుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంపికలో ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థ ద్వారానే ఎంపిక చేయాలా లేదా నేషనల్ జ్యూడిషయల్ అడ్వైజరీ కమిటీతో చేపట్టాలా అనే అంశంలో నెలకొన్న సందిగ్దం వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికలో జాప్యం జరిగింది. తాజాగా ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా టీఎస్ ఠాకూర్ పదవీ బాద్యతలు స్వీకరించనున్నారు. 1952లో జమ్మూకాశ్మీర్ లో టీఎస్ ఠాకూర్ జన్మించారు. ఆయన తండ్రి సుప్రసిద్ధ న్యాయవాది డీడీ ఠాకూర్. ఠాకూర్ గతంలో కర్ణాటక - ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా - ఢిల్లీ హైకోర్టుకు 2008లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. పంజాబ్-హర్యానా హైకోర్టులకు సైతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.