Begin typing your search above and press return to search.
మద్రాస్ హైకోర్టు సీజే బదిలీపై రగడ వెనుక లెక్కేంది?
By: Tupaki Desk | 13 Sep 2019 6:00 AM GMTవిషయంలోకి వెళ్లటానికి ముందు చిన్న పోలిక ఒకటి చెప్పటం ద్వారా విషయం మొత్తం ఇట్టే అర్థమైపోతుంది. కొద్దికాలం క్రితం విడుదలై సంచలనంగా మారి.. నేటికి పలువురు తమ ప్రస్తావనలో తీసుకొచ్చే బాహుబలి సినిమా చూసే ఉంటారు. అందులో పెద్ద ప్రభాస్ పాత్రకు దక్కాల్సిన చక్రవర్తి పదవి.. రాణాకు ఎందుకు దక్కిందో? ఇట్టే అర్థమైపోతుంది. ప్రభాస్ కున్న సామర్థ్యం రాణా పాత్రధారికి లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ప్రభాస్ పదవి కత్తిరించి అతడ్ని సైన్యాధ్యక్షుడ్ని చేయటం చూస్తే ఒళ్లు మండక మానదు.
సరిగ్గా ఇలాంటిదే జరిగిందని చెప్పటం లేదు కానీ.. ఇంచుమించు ఇలాంటిదే. ఎందుకంటే.. 75 మంది జడ్జిలు ఉన్న ఒక పెద్ద కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న ప్రధాన న్యాయమూర్తిని ముగ్గురంటే ముగ్గురు ఉన్న హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయటాన్ని ఏమనాలి? దాన్ని ప్రమోషన్ అనాలా? డిమోషన్ అనాలా? సరిగ్గా ఇలాంటి ప్రశ్నల్నే సంధిస్తున్నారు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తహిల్ రమణి తీరు చూస్తుంటే.
తన పనితీరుకు బహుమానంగా ఇచ్చిన బదిలీపై ఆగ్రహంతో ఉన్న ఆమె.. తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారటమే కాదు.. ఆమెకు మద్దతుగా పెద్దఎత్తున సంఘీభావం జరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద హైకోర్టుల్లో ఒకటిగా చెప్పే మద్రాస్ హైకోర్టు లాంటి కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రమణిని.. పెద్ద ప్రాధాన్యం లేని చిన్న రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయటం వెనుక ఏదో జరిగిందన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
జస్టిస్ రమణి గతంలోకి వెళితే.. క్రిమినల్.. అప్పీలు కేులు.. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల విచారణలో ఆమెకు మంచి పేరుంది. గుజరాత్ అల్లర్ల కేసులో కొందరిని నిర్దోషులుగా ప్రకటించారు. అయితే.. ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన సమయంలో సదరు తీర్పును రద్దు చేసి.. నిర్దోషులుగా బయటపడిన వారిలో కొందరికి శిక్ష విదించటంతో ఆమె పేరుప్రఖ్యాతులు మరింత పెరిగాయి.
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న జస్టిస్ రమణి రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అవుతారన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు భిన్నంగా ఆమె కంటే జూనియర్ అయిన ఒక న్యాయమూర్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయటం.. జస్టిస్ రమణిని అనూహ్యంగా ముగ్గురు జడ్జిలు ఉన్న హైకోర్టుకు ట్రాన్సఫర్ చేయటం ఏమిటన్నది పెద్ద ప్రశ్న.
జస్టిస్ రమణికి మద్దతుగా నిలుస్తూ.. బదిలీ విషయంలో ఆమెకు అన్యాయం జరిగినట్లుగా పెద్ద ఎత్తు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జస్టిస్ రమణి కూడా తనకొచ్చిన బదిలీపై గుర్రుగా ఉండటంతోనే.. తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం జరిగిన బదిలీని ఆమె ఓకే అంటే.. ఆమె కెరీర్ లో మళ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లటం కష్టమంటున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ మీద వెళితే.. రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ కారణంతోనే ఆమెను తొక్కేసేందుకే ఎలాంటి ప్రాధాన్యం లేని మేఘాలయ హైకోర్టుకు ట్రాన్సఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. 4.5 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్న కోర్టు నుంచి కేవలం 1400 కేసులున్న చిన్నపాటి హైకోర్టుకు బదిలీ చేయటంపై పలువురు విస్మయానికి గురి అవుతున్నారు. చివరకు జస్టిస్ రమణి సైతం తన బదిలీపై తనకున్న అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కొలీజియంకు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆమె లేఖను సుప్రీంకోర్టు ప్రతినిధులు ఓకే చేయకపోవటంతో.. ఆమె రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా ఆమె బదిలీ వ్యవహారం ఇప్పుడు న్యాయవర్గాల్లోనే కాదు.. అధికార వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెప్పక తప్పదు.
జస్టిస్ రమణి రాజీనామాకు అండగా తమిళనాడు.. పుదుచ్చేరి న్యాయవాదులు బహిరంగంగా సంఘీభావాన్ని తెలిపారు. విధులను బహిష్కరిస్తూ.. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు నుంచి మేఘాలయకు బదిలీ అంటే కచ్ఛితంగా అది పనిష్ మెంట్ తో సమానమంటున్నారు. అయితే. . బదిలీల విషయంలో తాము నిబద్దతతో వ్యవహరిస్తామని పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోలీజియం మాటల్ని చాలామంది సందేహంగా చూస్తుండటం గమనార్హం.