Begin typing your search above and press return to search.
బాబుకు షాకిచ్చిన జస్టిస్ మంజునాథ!
By: Tupaki Desk | 2 Dec 2017 5:13 AM GMTకాపుల్ని బీసీల్లోకి చేరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన హైలెట్ అయ్యింది. అన్ని మీడియా సంస్థల్లోనూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన రిజర్వేషన్ల మాట ఫోకస్ అయ్యింది. ఈ హడావుడిలో ఒక ఆసక్తికరమైన విషయం మరుగన పడింది. తన ప్రకటనలో పలువురి దృష్టిని ఆకర్షించిన చంద్రబాబు.. తన ప్రకటనకు ముందు భారీ షాక్ తగిలిన విషయం మాత్రం ఎక్కడా హైలెట్ కాలేదు. బాబు ఎంతమాత్రం ఊహించని రీతిలో వ్యవహరించిన జస్టిస్ మంజునాథ వ్యవహారం చర్చనీయాంశం కాలేదు.
బాబు ఊహించని రీతిలో జస్టిస్ మంజునాథ ఏం చేశారన్న విషయంలోకి వెళితే.. కాపుల్ని బీసీల్లోకి చేర్చే అంశంపై కమిషన్ వేశారు. జస్టిస్ మంజునాథ కమిసన్ లో జస్టిస్ మంజునాథతో కలిసి నలుగురుసభ్యులు ఉంటారు. వారిలో ముగ్గురు సభ్యులు తమ నివేదిక ఇస్తే.. అసలు వ్యక్తి అయిన జస్టిస్ మంజునాథ తన నివేదికను ఇవ్వలేదు. కాపులకు రిజర్వేషన్లను తాను సిఫార్సు చేయలేనని ఆయన చెప్పటం గమనార్హం. అందుకే తాను నివేదిక ఇవ్వలేదని తేల్చేశారు. ఏ పేరు మీద అయితే కాపుల రిజర్వేషన్ల కోసం కమిషన్ వేశారో.. ఆ పెద్ద మనిషే రిజర్వేషన్లు అవసరం లేదని తేల్చి చెప్పటం విశేషం.
కాపులనకు రిజర్వేషన్లు ఇవ్వమని తాను సిపార్సు చేయలేనని.. అందుకే తాను నివేదిక ఇవ్వలేనని జస్టిస్ మంజునాథ్ తేల్చి చెప్పేశారు. కమిషన్ సభ్యులు సీఎంను కలవటం.. వెంటనే దాన్ని మంత్రివర్గంలో టేబుల్ ఐటెంగా పెట్టేయటం.. ఆ వెంటనే ప్రకటన చేసేయటం కనిపిస్తుంది.
కాపు.. బలిజ.. ఒంటరి.. తెలగ కులస్తుల్ని బీసీల జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని మంజునాథ కమిషన్ లోని మెజరా్టీ సభ్యులు చెప్పినా జస్టిస్ మంజునాథ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. అసలు రిజర్వేషన్ల వ్యవస్థ మీద.. వాటి అమలు తీరు మీద నివేదిక సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు వద్దన్న మాటతో పాటు.. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్ల విధానంపై జస్టిస్ మంజునాథ తయారు చేసిన నివేదిక సంచలనంగా మారుతుందని.. తేనెతుట్టె కదిపినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని ఏపీ సర్కారు పెద్దగా ప్రచారం చేయలేదని చెబుతున్నారు. ఏమైనా జస్టిస్ మంజునాథ ఏపీ సీఎం బాబుకు దిమ్మ తిరిగిపోయేలా వ్యవహరించినట్లుగా అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.