Begin typing your search above and press return to search.
జస్ట్ వన్ మంత్ : ఏపీ జనం మూడ్ ఏంటో తెలిసిపోతుంది
By: Tupaki Desk | 9 Feb 2023 3:34 PM GMTఏపీ ప్రజలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మీద ఏమి అనుకుంటున్నారు. ఆల్ ఈజ్ వెల్ అని వైసీపీ ఏలికలు అనుకుంటున్న విధంగా ఏపీలో సీన్ ఉందా. అంతా క్యాట్ వాక్ గానే ఉందా. వై నాట్ 175 సీట్లు అన్న జగన్ ధీమాకు జనం జై కొడుతున్నారా లేక విపక్షాలు చెబుతున్నట్లుగా ఏపీలో జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా. విపక్షం గట్టిగా ఉందా. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం చేతులు మారుతుందా. ఇత్యాది ప్రశ్నలకు సరైన సమాధానం మరో నెల రోజులు ఆగితే తెలియబోతోంది.
ఎందుకంటే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికలు కూడా ఆషామాషీగా తీసివేయడానికి లేదు. పట్టభద్రుల స్థానానికి మూడు చోట్ల, మరో రెండు చోట్ల టీచర్ ఎన్నికలు ఉన్నాయి. దాంతో పాటుగా ఏపీలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిగ్రీ స్థాయి విద్యావంతులు అయిన వారు ఈ రోజున ఎంతో మంది ఉన్నారు. అలా పట్టభద్రుల సీట్లలో ఫలితాలు ఆసక్తిని రేపే విధంగా ఉన్నాయి.
ఇక టీచర్స్ అంటే చైతన్యం కలిగిన వారు. ప్రభుత్వం తరఫున వారే ఉంటారు. ప్రభుత్వాలు మారాలీ అంటే ముందు వారే సారధులు గా ఉంటారు. వారు తలచుకుంటే ఎంతటి బలమైన ప్రభుత్వం అయినా కుప్ప కూలుతుంది. అలా చూసుకుంటే టీచర్స్ ఇపుడు అధికార పార్టీ మీద తన విధానం ఏంతో కచ్చితంగా చెప్పనున్నారు అని అంటున్నారు.
ఇలా కనుక చూసుకుంటే ప్రజల నాడిని పట్టుకునేందుకు ఈ ఎన్నికలు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. ఒక విధంగా చూసే 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ గా చెప్పాలి. ఈ అయిదు ఎన్నికలతోనే కాదు స్థానిక సంస్థల కోటాలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అవి కూడా అధికార పార్టీ మీద రాజకీయ నేతలు, దిగువ స్థాయిలో ఉండే ప్రజా ప్రతినిధుల వైఖరి ఏ విధంగా ఉందో కూడా చాటి చెప్పనున్నాయి.
ప్రస్తుతం మాత్రం అయిదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. 2019 ఎన్నికలను తీసుకుంటే పట్టభద్రులు పెద్ద ఎత్తున వైసీపీకి మాద్దతుగా నిలిచారు. దాంతో వైసీపీకి ఆ ఎన్నికల్లో అధికారం దక్కింది. ఇపుడు చూస్తే సీన్ మారిందా అన్న చర్చ ఉంది. పట్టభద్రులు అంతా నిరుద్యోగంతో ఉన్నారు. లేక చిరుద్యోగులుగా ఉన్నారు. మరి వారు తమ కోపాన్ని ప్రదర్శించారు అంటే కచ్చితంగా అది దెబ్బగా మారుతుంది అని అంటున్నారు.
ఇక ఉపాధ్యాయులు తీసుకుంటే సీపీఎస్ రద్దు హామీ కూడా వారిని వైసీపీ వైపుగా నడిపించింది. దాంతో వారు ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు. అలా విజయాలు వైసీపీ సొంతం అయ్యాయి. టీచర్ ఎమ్మెల్సీ చూసుకుంటే ఏపీలో రెండు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గంతో పాటుగా కడప- అనంతపురం- కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారు వైసీపీ నుంచి మాత్రం కారు.
అయితే ఈసారి ఈ సీట్లు వైసీపీ గెలుచుకుంటుందా అన్నదే చూడాలి. సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, కత్తి నరసింహారెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. ఇక పట్టభద్రుల సీట్లు చూస్తే ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు. కడప- అనంతపురం- కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాలరెడ్డి కూడా అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ- టీడీపీ తమ అభ్యర్దులను ప్రకటించాయి. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయని వైసీపీ టీడీపీ ఈసారి సై అంటున్నాయి. దాంతో హోరా హోరీ పోరు తప్పడం లేదు అని అంటున్నారు. మరి ఇక్కడ కనుక వైసీపీకి బిగ్ షాక్ తగిలితే ఏపీలో విపక్షం దూకుడు మామూలుగా ఉండదు. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా వామపక్ష అభ్యర్ధులు గెలుసారు ఇపుడు వారు తెలుగుదేశం వైపు ఉన్నారు. దాంతో అన్ని రాజకీయ పక్షాలు అధికార పార్టీ మీద గురి పెట్టడంతో వైసీపీకి ఇదొక లిట్మస్ టెస్ట్ గా ఉంటుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.