Begin typing your search above and press return to search.

ట్రంప్‌ రిటైర్మెంట్‌ కి కొన్నిగంటల ముందు ... ప్రియుడుతో టిఫనీ ట్రంప్‌ ఎంగేజ్మెంట్...

By:  Tupaki Desk   |   20 Jan 2021 11:04 AM GMT
ట్రంప్‌ రిటైర్మెంట్‌ కి  కొన్నిగంటల ముందు ...  ప్రియుడుతో టిఫనీ ట్రంప్‌ ఎంగేజ్మెంట్...
X
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పబోతున్న కొద్ది గంటల ముందు ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ ఎంగేజ్ ‌మెంట్‌ సంబరాల్లో మునిగి తేలారు. తండ్రి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీవిరమణకు ఒక రోజు ముందు వైట్ హౌస్‌ లో మంగళవారం ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో నిశ్చితార్థం వేడుక చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టిఫనీ ఇన్‌ స్టాలో ప్రకటించారు.

కుటుంబ సభ్యులతో కలిసి వైట్‌ హౌస్‌ లో కీలక మైలురాళ్లు, చారిత్రాత్మక సందర్భాలను జరుపుకోవడం, అనేక జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం సంతోషంగా ఉంది. కాబోయే భర్త మైఖేల్‌ తో నిశ్చితార్థం జరుపుకోవడం ప్రత్యేక సందర్భం, అదృష్టం ఇంకేదీ లేదు. రానున్న అద్భుత క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా అంటూ ఇన్ ‌స్టాలో తెలిపారు. దుబాయ్ నుంచిప్రత్యేకంగా తెప్పించిన 13 క్యారెట్లఎమరాల్డ్ కట్ డైమండ్‌ రింగుతో టిఫనీకి తన ప్రేమను ప్రతిపాదించాడట బౌలోస్.

దీని విలువ 1.2 మిలియన్ డాలర్లుంటుందని అంచనా. ట్రంప్‌ రెండవ భార్య మార్లా మాపుల్స్ ఏకైక సంతానం టిఫనీ ట్రంప్ జార్జ్‌ టౌన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా లండన్ వ్యాపారవేత్త బౌలోస్ లెబనాన్‌ లో జన్మించాడు. హుళ బిలియన్ డాలర్ల నైజీరియా సంస్థ వారసుడైన బౌలోస్‌ లండన్‌ కాలేజీలో చదువుకున్నాడు. ఈ జంటను మొదటిసారిగా 2018 జనవరిలో కెమెరా కంటికి చిక్కడంతో వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది.