Begin typing your search above and press return to search.

ట్రంప్ పోటీ క‌ష్ట‌మే.. అధ్య‌క్ష ఎన్నిక‌లు వ‌దులుకోవాల్సిందే.. వెంటాడుతున్న కేసులు

By:  Tupaki Desk   |   10 May 2023 9:52 AM GMT
ట్రంప్ పోటీ క‌ష్ట‌మే.. అధ్య‌క్ష ఎన్నిక‌లు వ‌దులుకోవాల్సిందే.. వెంటాడుతున్న కేసులు
X
అగ్ర‌రాజ్య అమెరికా ఫైర్ బ్రాండ్‌, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల‌బ‌రిలో ఉన్నాన‌ని.. ప‌దే ప‌దే చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కొన్ని న‌గ‌రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ప్రారంభించారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ఆయ‌న‌ పై కేసుల క‌త్తి మ‌రింత ప‌దును తేరింది. ఎప్పుడో 33 ఏళ్ల కింద‌టి కేసును త‌వ్వి తీశారు. దీని ప్ర‌కారం.. ఆయ‌న అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగిందంటే.. 1990వ సంవత్సరంలో మాన్ హట్టన్ లోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్ లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని ప్రముఖ అమెరికా రచయిత్రి ఈ జీన్ కారోల్ చేసిన ఆరోపణల కేసును జ్యూరీ విచారించింది. రచయిత్రి ఇ. జీన్ కారోల్‌ పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డా రని, ఆమెకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.

జ్యూరీ ఆదేశాలు మళ్లీ వైట్ హౌస్‌ ను తిరిగి పొందాలని ప్రచారం చేస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు శరాఘాతంలా మారాయి. క్యారోల్‌ ను అబద్ధాలకోరుగా పేర్కొంటూ ట్రంప్ పరువు తీశారని కూడా జ్యూరీ పేర్కొంది. కాగా ఈ కేసులో ట్రంప్ మళ్లీ అప్పీలు చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ న్యాయవాది టకోపినా విలేకరులకు చెప్పారు."ఈ రోజు ప్రపంచం చివర కు నిజం తెలుసుకుంటోంది. ఈ విజయం నాకే కాదు,బాధపడిన ప్రతి స్త్రీకి" అని కారోల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

ఇక‌, ఇప్ప‌టికే పోర్న్ స్టార్‌ తో సెక్స్ చేశార‌నే అభియోగాల‌తో ట్రంప్‌ను అరెస్టుచేయ‌డం.. ఆయ‌న బెయిల్ తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా కెరోల్ కేసులో ఆయ‌న‌కు జ‌రిమానా విధించారు. ఈ ప‌రిణామా ల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి నిలిచే అవ‌కాశం దాదాపు కోల్పోయార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కు లు. అమెరికా చ‌ట్టాలు.. ఆయ‌న‌ను పోటీకి కూడా అనుమ‌తించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.