Begin typing your search above and press return to search.

ఆకాశవీధిలో అరుదైన దృశ్యం.. త్రికోణాకృతిలో చంద్రుడు.. శని.. గురు గ్రహాలు

By:  Tupaki Desk   |   17 Dec 2020 7:48 AM GMT
ఆకాశవీధిలో అరుదైన దృశ్యం.. త్రికోణాకృతిలో చంద్రుడు.. శని.. గురు గ్రహాలు
X
వినీలాకాశంలో కొన్ని లక్షల నక్షత్రాలు మనకు కనువిందుచేస్తుంటాయి. ఆకాశవీధిలో మనకు ఎన్నో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం అవుతాయి. వాటిని ఆస్వాదిస్తూ గడపడం ఎంతో బాగుంటుంది. ఇటీవలే చందమామ నీలిరంగులోకి మారి.. బ్లూమూన్​గా కనువిందు చేసింది. ఆకాశంలో ప్రతిరోజూ ఎన్నో ఎన్నోన్నో దృశ్యాలు కనిపిస్తుంటాయి. నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు, పాలపుంతలు ఇవన్నీ కనిపిస్తాయి. అయితే తాజాగా ఆకాశంలో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకున్నది.

జాబిల్లి, శని, గురు గ్రహాలు ఒకేచోటకు చేరాయి. మరోవైపు ఇవి మూడు త్రికోణాకృతికి వచ్చాయి. ఇటువంటి దృశ్యాలు కనిపించడం అరుదని ఖగోళశాస్త్రవేత్తలు అంటున్నారు. అటువంటిది ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు ఇలాంటి సీన్​ ఆకాశవీధిలో కనిపించింది. గతంలో నవంబర్​ 20న చంద్రుడు-శని-గురు గ్రహాలు త్రిభుజ ఆకారంలో కనిపించి కనువిందు చేశాయి. మళ్లీ డిసెంబర్​ 16న మరోసారి ఇటువంటి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

అయితే ఆకాశంలో చీకటిపొరలు ఆవిరించుకున్న కొద్ది సేపటికే ఈ దృశ్యం కనిపించింది. దీన్ని వీక్షించేందుకు చాలా మంది చిన్నసైజు టెలిస్కోపులు ఉపయోగించారు. గురు గ్రహంపై క్రేటర్స్ , ఆ గ్రహంపై ఉన్న చంద్రుడు కనిపించినట్లు కొందరు చెబుతున్నారు. ఇక శని గ్రహం చుట్టూ ఉన్న రింగ్స్ కూడా టెలిస్కోప్ ద్వారా కనిపించినట్లు ఈ అద్భుత దృశ్యాన్ని చూసినవారు చెబుతున్నారు. 21వ తేదీన గ్రేట్ కంజంక్షన్ ఏర్పడుతుందని అంతకంటే ఐదు రోజుల ముందు చంద్రుడు, శని, గురు గ్రహాలు త్రిభుజం ఆకారంలో కనిపించి కనువిందు చేస్తాయని శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పారు.