Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌పై అసంతృప్తి.. బీజేపీపై చూపు

By:  Tupaki Desk   |   13 March 2022 10:29 AM GMT
టీఆర్ఎస్‌పై అసంతృప్తి.. బీజేపీపై చూపు
X
ఓ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని దాటి తెలంగాణ‌లో హ్యాట్రిక్ కొట్టాల‌ని కేసీఆర్ చూస్తున్నారు. మ‌రోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ‌లోనూ పాతుకుపోయిందేకు చేరిక‌ల‌పై బీజేపీ దృష్టి సారించింది. టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త సీనియ‌ర్ నేత‌ల‌కు గాలెం వేసేందుకు క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో ఎంతో ప‌లుకుబ‌డి ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, జూప‌ల్లి కృష్ణారావు. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, పిడ‌మ‌ర్తి ర‌వి లాంటి నాయ‌కుల‌ను తమ‌వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా త్వ‌ర‌లోనే మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆయ‌న త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల వ‌న‌ప‌ర్తిలో కేసీఆర్ ప‌ర్య‌టించిన‌ప్పుడు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన కీల‌క నేత అయిన జూప‌ల్లి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆయ‌న‌కు సీఎం కార్య‌క్ర‌మం గురించి పిలుపు అంద‌లేద‌ని తెలిసింది. దీంతో వెంట‌నే ఆయ‌న ఖ‌మ్మం వెళ్లిపోయారు. అక్క‌డ ఇత‌ర టీఆర్ఎస్ అసంతృప్త నేత‌లు తుమ్మ‌ల‌, పొంగులేటి, పిడ‌మ‌ర్తితో ఆయ‌న స‌మావేశ‌మయ్యారు.

త‌మ భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై ఈ నేత‌లు చ‌ర్చించిన‌ట్లు స‌మావేశం. టీఆర్ఎస్ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ని నేప‌థ్యంలో ఏం చేయాల‌నే దానిపై మంత‌నాలు జ‌రిపిన‌ట్లు తెలిసింది.

ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న త‌ర్వాత కొల్హాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లాల వారీగా జూప‌ల్లి వ‌రుస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో త‌న‌కు భ‌విష్య‌త్ లేద‌ని భావిస్తున్న ఆయ‌న రాజ‌కీయంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో అని ఆలోచిస్తున్నారు.

అందుకే వరుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారని విశ్లేష‌కులు చెబుతున్నారు. చివ‌ర‌కు ఆయ‌న బీజేపీ గూటికే చేర‌తార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏ నిర్ణ‌యమైనా ప్ర‌జ‌ల కోస‌మే తీసుకుంటాన‌ని జూప‌ల్లి అంటున్నారు. 9 నెలల్లో ఏం జ‌రుగుతుందో చూడాల‌ని చెబుతున్నారు. మ‌రోవైపు తుమ్మ‌ల‌, పొంగులేటి అనుచ‌రుల భేటి.. తుమ్మ‌ల ప్ర‌ధాన అనుచ‌రుల స‌మావేశం.. ఇలా ఖ‌మ్మంలోనూ రాజ‌కీయాలు వేడెక్కాయి. మ‌రి ఈ అసంతృప్త నేత‌లంతా బీజేపీలోనే చేర‌తారా? అన్న‌ది చూడాలి.